NTV Telugu Site icon

Double iSmart: డబుల్ ఇసార్ట్ కూడా ముంబైలోనే మొదలెట్టిన పూరీ

Double Ismart Regular Shoot Commences In Mumbai

Double Ismart Regular Shoot Commences In Mumbai

ఇప్పట్లో ముంబైని పూరి జగన్నాథ్ వదిలేట్టు కనిపించడం లేదు. ఆయన లైగర్ సినిమా షూటింగ్ అంతా దాదాపు ముంబైలోనే పూర్తి చేయగా ఇప్పుడు తన తరువాతి సినిమా షూట్ కోసం కూడా అక్కడికి వెళ్లారు. ఉస్తాద్ రామ్ పోతినేని, సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ల క్రేజీ ప్రాజెక్ట్ ‘డబుల్ ఇస్మార్ట్‌’ లాంఛనంగా మొదలైన సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో తన పాత్ర కోసం రామ్ మేకోవర్ అందరినీ ఆశ్చర్యపరిచింది. తన ట్రాన్స్ ఫర్మేషన్ చూపించే వీడియోలో సూపర్ స్మార్ట్ గా కూడా కనిపించారు రామ్ పోతినేని. పూరీ కనెక్ట్స్‌ బ్యానర్ పై పూరీ జగన్నాధ్, ఛార్మి కలిసి ఈ సినిమాను నిర్మిస్తుండగా విషు రెడ్డి సీఈవోగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు ముంబైలో ప్రారంభమైంది. ఈ సినిమా కోసం నిర్మించిన భారీ సెట్‌ లో రామ్, ఫైటర్స్‌పై ఒక భారీ సీక్వెన్స్‌ తో టీమ్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించింది.

Kavya Kalyanram: ఆ డైరెక్టర్ బాడీ షేమింగ్ చేశాడు.. బలగం హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా నుంచి పూరి జగన్నాథ్ తో అసోసియేట్ అవుతున్న స్టంట్ డైరెక్టర్ కేచ ఈ యాక్షన్ సీక్వెన్స్ కి కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ జియాని జియానెల్లి పనిచేస్తున్నట్టు సినిమా యూనిట్ ప్రకటించింది. ఇక తాజాగా రిలీజ్ చేసిన వర్కింగ్ స్టిల్‌లో రామ్, చేతిలో ఫైర్ వర్క్స్ పట్టుకుని ట్రక్కులో కూర్చొని కనిపించగా పూరి, కేచ, జియానీలు కూడా చిరునవ్వుతో కనిపిస్తున్నారు. ఇక ఈ డబుల్ ఇస్మార్ట్ మూవీ సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో హై బడ్జెట్‌తో రూపొందుతోందని, ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో మేకర్స్ తెలియజేస్తారని అంటున్నారు. ఇక ఈ డబుల్ ఇస్మార్ట్ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుండగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మార్చి 8, 2024న మహా శివరాత్రికి ప్లాన్ చేస్తున్నారు.