Site icon NTV Telugu

Uday Shankar: ‘నచ్చింది గర్ల్ ఫ్రెండూ’ నుండి ‘దోస్త్…’ సాంగ్!

Nachindi Girlfriend Dost So

Nachindi Girlfriend Dost So

Dost Ante Nuvvera Song Released From Nachindhi Girlfriend: యంగ్ హీరో ఉదయ్ శంకర్ నటిస్తున్న కొత్త సినిమా ‘నచ్చింది గర్ల్ ఫ్రెండూ’. జెన్నీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో మధునందన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కమర్షియల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీని గురు పవన్ తెరకెక్కిస్తున్నారు. అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో అట్లూరి నారాయణ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆదివారం ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి ‘దోస్త్ అంటే నువ్వేరా.. ఫ్రెండ్ అంటే నువ్వేరా..’ అనే లిరికల్ సాంగ్ ను నిజజీవితంలో మంచి మిత్రులైన టాలెంటెడ్ హీరోలు నారా రోహిత్, శ్రీవిష్ణు కలిసి విడుదల చేశారు. పాట చాలా బాగుందన్న రోహిత్, శ్రీవిష్ణు… చిత్ర బృందానికి విషెస్ తెలిపారు.

ఈ పాటను గిఫ్టన్ ఎలియాస్ స్వరకల్పనలో మున్నా ఎస్డీ సాహిత్యాన్ని అందించగా రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ఈ పాటలో టాలీవుడ్ రియల్ ఫ్రెండ్స్ ప్రభాస్ – గోపీచంద్, పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్, ఎన్టీఆర్ – రామ్ చరణ్, మహేష్ బాబు – వంశీ పైడిపల్లి లాంటి వారిని చూపిస్తూ స్నేహం గొప్పదనం తెలియజేశారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ పాట గురించి రాహుల్ సిప్లిగంగ్ మాట్లాడుతూ, ”దీనిని పాడుతున్న‌ప్పుడే చాలా ఎంజాయ్ చేసాను. దోస్త్ లంద‌రికీ ఇది ఒక ఆంథ‌మ్ సాంగ్ అవుతుంద‌ని నా న‌మ్మ‌కం. ఈ పాట నాకు ఇచ్చిన మ్యూజిక్ ద‌ర్శ‌కుడు గిఫ్ట‌న్ కి, ద‌ర్శ‌కుడు గురు ప‌వ‌న్ కి థ్యాంక్స్” అని అన్నారు.

Exit mobile version