Site icon NTV Telugu

Rathnam: ఎన్నాళ్ళయింది మావా.. దేవిశ్రీ గొంతు విని.. అదరగొట్టేశాడు

Vishal

Vishal

Rathnam: మాస్ యాక్షన్ హీరో విశాల్ ప్రస్తుతం మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. జీ స్టూడియోస్‌తో పాటు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ‘రత్నం’ అనే సినిమాను రూపొందిస్తోంది. రత్నం సినిమాకు హరీ డైరెక్టర్‌గా, కార్మికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు . ఈ సినిమాలో విశాల్ ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్‌ను అందిస్తున్నాడు. ఈ మధ్యనే టైటిల్‌తో పాటు ఫస్ట్ షాట్ టీజర్‌ను విడుదల చేయగా అందరినీ ఆకట్టుకుంది. అందులో విశాల్ ఇది వరకు ఎన్నడూ చూడని లుక్కులో, మాస్ అవతారంలో కనిపించాడు. తల నరికి చేత్తో పట్టుకునే ఆ సీన్ అందరికీ గూస్ బంప్స్ ఇచ్చిందనే చెప్పాలి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

తాజాగా ఈ సినిమా నుంచి మరో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. డోంట్ వర్రీ.. డోంట్ వర్రీ రా చిచ్చా అంటూ సాగే ఈ సాంగ్ ఆకట్టుకుంటుంది. ఎంతో గ్యాప్ తరువాత దేవిశ్రీ ప్రసాద్.. సాంగ్ పాడి అలరించాడు. సాంగ్ విశాల్ క్యారెక్టర్ గురించి వివరించారు. సినిమాలో అతని క్యారెక్టర్.. చిన్నతనం నుంచి అతను పెరిగిన విధానం సాంగ్ రూపం లో వివరించారు. డోంట్ వర్రీ.. డోంట్ వర్రీ రా చిచ్చా.. ఇంతకన్నా ఎక్కువ కష్టాలు పడివచ్చా అంటూ రైమింగ్ లో సాగిన ఈ లిరిక్స్ ను శ్రీమణి అందించాడు. ఇక విశాల్ డ్యాన్స్.. హుక్ స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి సాంగ్స్ తోనే సినిమాపై హైప్ తీసుకొచ్చారు. మరి ఈ సినిమాతో విశాల్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Exit mobile version