Site icon NTV Telugu

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత 4 నెలల వరకు సినిమాలు వద్దు… సల్మాన్ వార్నింగ్

RRR

“ఆర్‌ఆర్‌ఆర్” ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ముంబై ఫిల్మ్ సిటీ సమీపంలోని గురుకుల్ మైదానంలో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన లైవ్ టెలికాస్ట్ జరగకపోయినా ఆసక్తికరమైన అప్డేట్లు మాత్రం బయటకు వస్తున్నాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లపై పొగడ్తల వర్షం కురిపిస్తూ గొప్పగా మాట్లాడారు.

Read Also :

https://ntvtelugu.com/salman-khan-officially-announces-bajrangi-bhaijaan-2-at-rrr-event/

సల్మాన్ మాట్లాడుతూ “నాకు జూనియర్ ఎన్టీఆర్ నటన అంటే చాలా ఇష్టం. ఆయన చాలా సహజంగా నటిస్తారు. ఇక నేను రామ్ చరణ్‌ని కలిసిన ప్రతిసారీ, అతనికి ఏదో ఒక గాయం లేదా మరొకటి ఉంటుంది. ఆయన తన ప్రాజెక్ట్‌ల సెట్‌లో ఉన్నప్పుడు తరచుగా గాయపడతాడు. తన ప్రాజెక్టుల కోసం ఆయన పడే శ్రమ అలాంటిది. చరణ్ నిజమైన హార్డ్ వర్కర్’ అంటూ ఇద్దరు హీరోలను ప్రశంసలతో ఆకాశానికెత్తేశారు. ఇక ఆయన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి మాట్లాడుతూ “ఆర్ఆర్ఆర్” రిలీజ్ అయ్యాక కనీసం 4 నెలల వరకు ఏ సినిమానూ విడుదల చేయకపోవడమే మంచిది’ అంటూ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతోందో చెప్పకనే చెప్పారు సల్మాన్. సల్మాన్ ఇచ్చిన ఈ ఒక్క స్వీట్ వార్నింగ్ చాలు బాలీవుడ్ లో ‘ఆర్ఆర్ఆర్’ హైప్ పెరగడానికి.

Exit mobile version