దొంగగా మారిన కీరవాణి తనయుడు శ్రీసింహా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహా కోడూరి హీరోగా నటిస్తున్న మూవీ ‘దొంగలున్నారు జాగ్రత్త’. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది. తాజాగా రెగ్యులర్ షూటింగ్ నూ ప్రారంభించారు. ఈ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ జస్టిఫికేషన్ కోసం అన్నట్టుగా ఓ ఫన్నీ వీడియోను తీసి యూట్యూబ్ లో విడుదల చేసింది. ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళి రావడం కోసం హీరో శ్రీసింహా రెండు గంటలు పర్మిషన్ అడిగితే, డైరెక్టర్ ‘నో’ చెప్పడంతో అతను ఏం చేశాడన్నది ఈ వీడియోలో ఉంది. షూటింగ్ చేయాల్సిన కెమెరాలోని మెమొరీ కార్డు మిస్ కావడంతో హీరో కోరుకున్నట్టే… షూటింగ్ ఆగిపోతుంది. దాంతో అతను ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళిపోతాడు. సో… ఈ మూవీ టీమ్ లోనూ దొంగలున్నారు జాగ్రత్త అని అనుకోవాల్సిన పరిస్థితి. దాదాపు మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ ఫన్నీ వీడియో వ్యూవర్స్ ను ఆకట్టుకుంటోంది. ప్రీతి అస్రాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సముతిర కని ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్ బ్యానర్లపై సురేష్ బాబు, సునీత తాటి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సతీష్ త్రిపుర దర్శకుడు. రోహిత్ కులకర్ణి సంగీత దర్శకత్వం వహిస్తుండగా యశ్వంత్ సీ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. గ్యారీ బీహెచ్ ఎడిటర్.
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!