Site icon NTV Telugu

Sohi Sisters: చిత్ర పరిశ్రమ లో విషాదం.. అక్క మృతిచెందిన కొద్దిసేపటికే చెల్లి కూడా..

Sohi

Sohi

Sohi Sisters: చిత్ర పరిశ్రమలో విషాదం విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్ నటీమణులు డాలీ సోహి, అమన్ దీప్ సోహి.. కొద్దీ గంటల వ్యవధిలోనే మృతిచెందారు. ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఒకేసారి మృతి చెందడంతో సోహి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. డాలీ సోహి.. జనక్, భాభీ వంటి టీవీ షోలతో మంచి పాపులారిటీని తెచ్చుకుంది. ఇక ఆరునెలల క్రితమే ఆమె క్యాన్సర్ బారిన పడింది. గర్భాశయ క్యాన్సర్ అని తెలియడంతో ఆమె చికిత్స తీసుకుంటుంది. క్యాన్సర్ ఊపిరితిత్తుల వరకు పాకిందని.. ఆరోగ్యం క్షీణించడంతో గతరాత్రే డాలీని ఆసుపత్రిలో చేర్చామని ఆమె సోదరుడు మన్‌ప్రీత్ తెలిపారు.

ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఆమె క్యాన్సర్ నుంచి కోలుకుంటుందని అందరూ ఆశించారు. ఆమె పరిస్థితి ఇలా ఉంటే .. ఆమె సోదరి, నటి అమన్ దీప్ సోహి కామెర్ల బారిన పడింది. గత కొన్నిరోజులుగా ఆమె కూడా డీవీ పాటిల్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటుంది. అయితే కామెర్లు ముదరడంతో అమన్ దీప్ సోహి నేటి ఉదయం మృతి చెందింది. సోదరి మరణవార్త విన్న కొద్దిసేపటికే డాలీ కూడా కన్నుమూసిందని వారి సోదరుడు మన్‌ప్రీత్ సోహి కన్నీటి పర్యంతమయ్యాడు. ఇక ఇద్దరు కూతుళ్లను ఒకేరోజు పోగొట్టుకున్న వారి తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరివలన కావడం లేదు. ఇక ఈ విషయం తెలియడంతో బాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. పలువురు ప్రముఖులు సోహి సిస్టర్స్ కు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version