Site icon NTV Telugu

Nikhil: ‘ఆర్ఆర్ఆర్’ కు ఆస్కార్ అవసరమా.. సంచలన వ్యాఖ్యలు చేసిన నిఖిల్

Nikhil

Nikhil

Nikhil: యంగ్ హీరో నిఖిల్ సినిమాల్లోనే కాదు.. సోషల్ మీడియాలో కూడా హీరోలానే మాట్లాడుతుంటాడు. ఏ విషయమైనా తనకు నచ్చకపోతే ఎవరు ఏమంటారు అనేది ఆలోచించకుండా తన అభిప్రాయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. తాజాగా నిఖిల్ ఆస్కార్ అవార్డుల పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ నామినేషన్స్ లో చోటు దక్కించుకోలేకపోవడంతో ప్రతి ఒక్కరు బాధపడుతున్న విషయం విదితమే.. పలువురు సినీ ప్రముఖులు కూడా ఆర్ఆర్ఆర్ ఆస్కార్ లో ఉంటుందని భావించినట్లు చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయమై నిఖిల్ ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆస్కార్ మనకు ఎందుకు..? మనకు అవసరమా..? అంటూ చెప్పుకొచ్చాడు.

” మీరెవ్వరు నన్ను తప్పుగా అనుకోకండి. నాకు ఆస్కార్ అవార్డుల పై అంత పెద్ద ఆసక్తి లేదు. మంచి అభిప్రాయం కూడా లేదు. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు ఆస్కార్ రావాలని, వస్తే బావుంటుందని అనుకుంటారు. కానీ, నాకు మాత్రం ప్రజల నుంచి వచ్చే ప్రశంసలే ఆస్కార్ కంటే గొప్పవిగా భావిస్తాను. ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ అవసరమా.. దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రశంసలు అందించారు. అదే పెద్ద విజయం. మనకు ఫిల్మ్‌ఫేర్‌, జాతీయ అవార్డులు..ఇలా మన సొంత అవార్డులు ఉన్నాయి.. మనకింక ఆస్కార్ ఎందుకు..? నేనేదో ఆస్కార్ కు ప్రాముఖ్యత ఇవ్వడంలేదని తిట్టకండి.. అసలు మన సినిమాలకు ఆస్కార్ సర్టిఫికెట్ ఎందుకు.. అవసరమా.. ? మన సినిమాలు అద్భుతంగా ఉంటాయి. ప్రస్తుతం భారతీయ సినిమాలు అన్నిచోట్లా సంచలనం సృష్టిస్తున్నాయి. నేను ఇటీవల స్పెయిన్ వెళ్ళినప్పుడు ఆర్ఆర్ఆర్ చూసాను.. థియేటర్లన్నీ హౌస్ ఫుల్ అయ్యాయి. ఒక్క స్పెయిన్ అనే కాదు.. అన్ని దేశాల్లో కూడా ఆర్ఆర్ఆర్ షేక్ చేస్తోంది.. అలాంటప్పుడు అంతకు మించిన ఆస్కార్ సర్టిఫికెట్ మనకు ఎందుకు..?” అని చెప్పుకొచ్చాడు. అయితే నిఖిల్ చెప్పిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version