NTV Telugu Site icon

Director Food: తెలుగు పాన్ ఇండియా డైరెక్టర్ ఈ ఒక్క ఫుడ్ తప్ప ఇంకేం తినడు తెలుసా?

Director Eating Food Habits

Director Eating Food Habits

Do You Know this Director Eats only Idly: చేసిన మొదటి సినిమాతోనే మంచి సూపర్ హిట్ అందుకుని రెండో సినిమాతోనే పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఒక డైరెక్టర్ ఫుడ్ హ్యాబిట్ గురించి తాజాగా వెలుగులోకి వచ్చింది. నిజానికి తెలుగు వారు భోజన ప్రియులు. ఫుడ్ ఉంటే కనుక దాన్ని ఒక పట్టు పట్టేదాకా వదిలిపెట్టరు. అలాంటిది మన తెలుగు డైరెక్టర్ ఒకరు మాత్రం ఫుడ్ విషయంలో తీసుకునే కేర్ షాక్ కలిగిస్తోంది. అయన ఒక స్టార్ డైరెక్టర్ చేసిన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు.

SSMB 31: మహేష్ ను లైన్లో పెట్టిన గురూజీ.. షరతులు వర్తిస్తాయ్!

ఆ సినిమాకి వచ్చిన క్రేజ్ తో రెండో సినిమానే పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కింది. దానితో కూడా ఆయన మరో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక వరుస హిట్లు అందుకున్న ఆయన తీసుకునే ఫుడ్ గురించి తెలిస్తే మీరు షాక్ అవడం ఖాయం. అదేమంటే ఆయన మనలాగా అన్నమో లేక చపాతీలు లాంటివో అస్సలు తినరట. కేవలం ఆయన ఇడ్లీలు మాత్రమే ఆహారంగా తీసుకుంటారట. ఏదైనా ఫుడ్ తీసుకునే అందులో ఎన్ని క్యాలరీలు ఉంటాయి? ఎంత ఆరోగ్యకరం అని రీసెర్చ్ చేయడం కంటే తనకు బాగా తెలిసిన ఇడ్లీ తింటే బెటర్ అని భావించి దానికే ఫిక్స్ అయిపోయారట.