మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం వరుసగా సినిమాలు మరియు వెబ్ సిరీస్ లలో నటిస్తూ చాలా బిజీగా ఉంది.. తెలుగులో సినిమా అవకాశాలు కాస్త తగ్గినప్పటికీ కూడా వెబ్ సిరీస్ లతో మెప్పిస్తుంది. ఈమె బాలీవుడ్ లో మొదట జీ కర్థ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఆ సిరీస్ లో బోల్డ్ సన్నివేశాలలో రెచ్చిపోయింది. ఆ సిరీస్ తరువాత ఈమె బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో కలిసి లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ కు రెండవ భాగంగా వచ్చిన లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లో నటించింది.ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది.ఇక ఈ వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలోనే తమన్నా బాలీవుడ్ నటుడు అయిన విజయ్ వర్మతో ప్రేమలో పడ్డానని, ఈ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాలలో చెప్పుకొచ్చింది.
తమన్నా ఈ సిరీస్ లో కూడా కొన్ని బోల్డ్ సన్నివేశాలలో నటించింది.
ఆమె సినీ కెరియర్ లో ఏ సినిమాలో కూడా ఈ స్థాయిలో బోల్డ్ గా నటించలేదు.. ఇలా ఈ సిరీస్ లో ఈమె ఏకంగా లిప్ కిస్ సీన్స్ అలాగే బెడ్ రూం సీన్స్ లో కూడా నటించి అందరికీ షాక్ ఇచ్చింది తమన్నా.ప్రస్తుతం ఈ సిరీస్ మంచి ఆదరణ కూడా పొందింది.మరి ఈ సిరీస్ కోసం తమన్నా భారీ స్థాయిలో పారితోషకం తీసుకున్నట్లు ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. తమన్నా ఒక్కో సినిమాకు దాదాపు నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయల వరకు పారితోషకం అందుకుంటారు. అయితే ఈ సిరీస్ కోసం ఏకంగా ఆరు కోట్ల రూపాయల పారితోషకం అందుకున్నారని సమాచారం.తమన్నా ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో చిరంజీవికి జోడిగా నటిస్తున్నారు. ఈ సినిమా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఈ సినిమా కనుక బ్లాక్ బస్టర్ హిట్ అయితే మళ్ళీ తమన్నా కు తెలుగులో వరుస అవకాశాలు వస్తాయి.
