Site icon NTV Telugu

Tholiprema : ఈ క్లాసిక్ లవ్ స్టోరికి పవన్ అందుకున్న పారితోషకం ఎంతో తెలుసా..?

Whatsapp Image 2023 06 25 At 2.56.06 Pm

Whatsapp Image 2023 06 25 At 2.56.06 Pm

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు కీర్తి రెడ్డి జంటగా నటించిన చిత్రం తొలి ప్రేమ..కరుణాకరన్ తెరకెక్కించిన ఈ సినిమా 1998 లో విడుదల అయింది.ఈ క్లాసిక్ లవ్ స్టోరీ  అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేసింది.ఈ సినిమా విడుదలై దాదాపు 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం తో తాజాగా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయాలనీ నిర్మాతలు భావించారు. ఈ క్రమం లోనే ఈ సినిమా ఈ నెల 30వ తేదీన మళ్ళీ విడుదల కాబోతుంది. ఈ సినిమా తిరిగి విడుదల అవుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రెస్ మీట్ ను కూడా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగం గా నిర్మాత జి.వి.జి రాజు మాట్లాడుతూ.. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ తీసుకున్న పారితోషకం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాకు దాదాపు 50 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం.తొలిప్రేమ సినిమా కోసం పవన్ కళ్యాణ్ లక్షలలోనే తీసుకున్నారని నిర్మాత జి.వి.జి రాజు చెప్పుకొచ్చారు.అయితే మేము ఆయనకీ ఎన్ని లక్షలు ఇచ్చాము అనే విషయాన్ని తాను చెప్పనని ఆయన తెలిపారు. సినిమా ఓకే అయిన తర్వాత మేము ఇంత పారితోషకం ఇవ్వగలమని కూడా ఆయనకు చెప్పాము.. అందుకు పవన్ కళ్యాణ్ కూడా ఓకే అని చెప్పారు. అయితే సినిమా పూర్తయిన తర్వాత ఇవ్వాలా అని అడగడంతో మీ ఇష్టం ఎప్పుడైనా ఇవ్వండి అని ఆయన అన్నారు.. అందుకే ముందు గా కొంత అడ్వాన్స్ ను ఇచ్చాము సినిమా పూర్తయిన తర్వాత మిగిలిన మొత్తం ఇస్తామని చెప్పాము . అప్పుడు పవన్ కళ్యాణ్ ఈ నెల నా ఖర్చుల కోసం కొంత ఇవ్వమని చెప్పి అడిగి తీసుకున్నారని అలాగే సినిమా విడుదలైన తర్వాత రెండు రోజుల కు మిగిలిన పారితోషకం మొత్తం ఇచ్చామని ఈ సందర్భంగా జీ.వి.జి రాజు చేసిన ఈ కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి.

Exit mobile version