NTV Telugu Site icon

Nayanthara: ‘ముద్దు’పై గొడవ… విఘ్నేష్ శివన్‌ను అవమానించిన నయనతార?

Nayanthara Vignesh Shivan

Nayanthara Vignesh Shivan

Do You Know Nayanthara Scolded Vignesh Shivan: నయనతార తన భర్త విఘ్నేష్ శివన్‌ను 2022లో పెళ్లాడింది. ఈ జంట సుమారు 7 సంవత్సరాలు డేటింగ్ చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. నయనతార విఘ్నేష్ శివన్‌తో ‘నానున్ రౌడీ థాన్‌’ సినిమాలో హీరోయిన్‌గా నటించినప్పుడు ప్రేమలో పడింది. షూటింగ్ సమయంలో ఇద్దరూ రహస్యంగా ప్రేమించుకున్నారు. ఆ సినిమాకి పనిచేసిన రాధికకు మాత్రమే వీరి ప్రేమ వ్యవహారం చివర్లో తెలిసిందని అనేవారు. వీరి ప్రేమ వ్యవహారం వెలుగులోకి రావడంతో విక్కీ – నయన్ జంట అవార్డ్ ఫంక్షన్స్, ఫిల్మ్ ఫెస్టివల్స్ కు జంటగా హాజరవడం మొదలుపెట్టారు.

Sheikh Hasina: షేక్ హసీనాకి యూకే షాక్ ఇవ్వబోతుందా.. ఆశ్రయం ఇచ్చేందుకు నిరాకరణ?

ముఖ్యంగా సైమా అవార్డ్స్ లో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ గెలుచుకున్న నయనతార.. అవార్డు అందజేయడానికి స్టేజ్ పైకి వచ్చిన అల్లు అర్జున్ కి తన బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ నుంచి అవార్డు అందుకోవాలని నయన్ చెప్పి విక్కీని స్టేజ్ పైకి వచ్చేలా చేసింది అతని చేతితో అవార్డును స్వీకరించడానికి. తర్వాత కొన్నేళ్లుగా ఇద్దరూ ఒకే ఇంట్లో సహజీవనం చేశారు. అంతే కాకుండా తరచూ దంపతులుగా విదేశాలకు వెళ్లేవారు. ప్రేమ పావురాల్లా ఉండే విక్కీ, నయన్ మధ్య గొడవ ఏంటి? ఎందుకు నయనతార విగ్నేష్ ను అవమానించింది అనేది ఇప్పుడు చూద్దాం. ‘నానున్ రౌడీ థాన్‌’ షూటింగ్‌లో ఇద్దరు ప్రేమలో పడినప్పుడు, నయన్‌, విజయ్‌ సేతుపతి మధ్య ఓ ముద్దు సన్నివేశాన్ని చిత్రీకరించాల్సి ఉంది. విక్కీ ఆ సీన్‌ని సరిగ్గా షూట్ చేస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ క్లోజ్ గా ఉండమని చెబుతూనే ఉన్నాడట. దీంతో టెన్షన్‌కు గురైన నయనతార విఘ్నేష్‌ శివన్‌ దగ్గరకు వచ్చి సైకో అని తిట్టి వెళ్లిపోయిందట. ఈ విషయాన్ని విఘ్నేష్ శివన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

Show comments