Site icon NTV Telugu

‘ఆర్ఆర్ఆర్’ ప్రెస్ మీట్ .. అందరి కళ్లు తారక్ వాచ్ పైనే!!

tarak

tarak

ప్రతిఒక్కరికి ఒక వస్తువంటే పిచ్చి ఉంటుంది.. కొందరికి కార్లు పిచ్చి .. ఇంకొందరికి ఫోటోగ్రాఫ్ ల పిచ్చి.. మరికొందరికి పురాతన వస్తువులను సేకరించడం పిచ్చి.. ఇక టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి వాచ్ లంటే పిచ్చి.. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బ్రాండ్ల విషయంలో ఎన్టీఆర్‌ తగ్గేదేలే అన్న విషయం అందరికి తెలియసిందే .. మొన్నటికి మొన్న ఇండియాలోనే మొదటి లాంబోగినీ కారు కొని వార్తల్లో నిలిచినా తారక్ తాజాగా.. కోట్ల రూపాయలు విలువ చేసే వాచ్ తో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు.

ప్రస్తుతం అందరి చూపు తారక్ వాచ్ మీదే ఉందంటే అతిశయోక్తి కాదు. ఇంకొంతమంది తారక్ వాచ్ ని గూగుల్ చేసి.. రేటు చూసి దిమ్మతిరిగిపోతున్నారు. రిచర్డ్ మిల్లే RM కు చెందిన 011 కార్బన్ NTPT గ్రోస్జీన్ వాచ్ గా పేరుగాంచిన ఈ వాచ్ ధర అక్షరాలా 5,14,800 డాలర్లు. అంటే దాదాపు 4 కోట్లు.. వామ్మో 4 కోట్లా అని నోరు వెళ్లబెడుతున్నారు. ప్రపంచంలోని అత్యధిక ఖరీదైన వాచ్‌ల్లో ఇది ఒకటి.. ఇలాంటి వాచ్ లు ఇప్పటికే తారక్ దగ్గర రెండు ఉన్నాయని టాక్.. ఏదిఏమైనా మరీ 4 కోట్లు ఏంటి.. ఆ డబ్బుతో రెండు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో లైఫ్ లాంగ్ బతుకుతాయి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version