పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా ‘బ్రో’. ఈ సినిమా పై భారీగా అంచనాలు వున్నాయి.ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు..ఈ సినిమా విడుదల కు సమయం దగ్గర పడింది… జులై నెల లోనే ఈ మూవీ విడుదల కాబోతుంది.ఈ క్రమంలోనే ఈ సినిమా నుండి వరుసగా ప్రమోషన్స్ మొదలు పెట్టారు మేకర్స్..త్వరలోనే బ్రో సినిమా టీజర్ ను విడుదల చేయనున్నారు. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా వచ్చింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ఒక వార్త బాగా వైరల్ గా మారింది..తాజా సమాచారం ప్రకారం ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రాజమండ్రి లో నిర్వహించాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.రాజమండ్రి అయితే ఈవెంట్ కు మంచి రెస్పాన్స్ వస్తుందని అలాగే . పవన్ వారాహి యాత్ర కూడా అటు వైపునే సాగుతున్న నేపథ్యంలో ఈ ఈవెంట్ ను అక్కడ ప్లాన్ చేస్తే పవన్ కు కూడా ఎంతో వీలుగా ఉంటుందని కనుక అక్కడ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న బ్రో సినిమా లో పవన్ పాత్ర కాస్త తక్కువే అయిన ఆయన నటిస్తుండటం తో ఈ సినిమా విడుదల కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు..ఈ సినిమా లో ప్రియా ప్రకాష్ వారియర్ మరియు కేతిక శర్మ హీరోయిన్ లు గా నటిస్తున్నారు.ఈ సినిమాను జీ స్టూడియోస్ తో కలిపి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారు… థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ను జులై 28న ఎంతో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో కూడా నటిస్తున్నాడు.యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నట్లు సమాచారం.