NTV Telugu Site icon

Vijayakanth: అత్యంత విషమంగా స్టార్ హీరో ఆరోగ్య పరిస్థితి

Actor Vijayakanth Health Update: ఒకప్పటి తమిళ స్టార్ హీరో, డీఎండీకే పార్టీ అధినేత విజయకాంత్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అసలు ఏమాత్రం నిలకడగా లేదని చెన్నైలోని మయత్ ఆస్పత్రి యాజమాన్యం నివేదిక ఇచ్చింది. డీఎండీకే అధినేత విజయకాంత్ అనారోగ్య కారణాలతో గత నవంబర్ 18న చెన్నైలోని మయత్ ఆస్పత్రిలో చేరారు. విజయకాంత్ దగ్గు, జలుబు, గొంతునొప్పితో బాధపడుతున్నందున సాధారణ వైద్య పరీక్షల కోసం వెళ్లినట్లు డీఎండీకే అప్పట్లో వెల్లడించింది. ఈ విషయమై అప్పట్లో డీఎండీ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ‘‘డీఎంయూడీఐ అధ్యక్షుడు విజయకాంత్ సాధారణ వైద్య పరీక్షల కోసం వెళ్లారు, ఒకట్రెండు రోజుల్లో ఇంటికి తిరిగి వస్తారు, వదంతులను ఎవరూ నమ్మవద్దని పేర్కొంది. అయితే ఆయన హాస్పిటల్ లో చేరిన వెంటనే విజయకాంత్‌కు కృత్రిమ శ్వాస అందిస్తున్నట్లు మీడియాలో వార్తలు ప్రచురితమవ్వగా.. నవంబర్ 20న డీఎండీకే పార్టీ అధిష్టానం ఆ వార్తలను ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది. అయితే సుమారు తొమ్మిది రోజులు అనంతరం ఈ రోజు (29-11-2023), DMDK అధినేత విజయకాంత్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి మయత్ హాస్పిటల్ పరిపాలన ఒక కొత్త వైద్య నివేదికను విడుదల చేసింది.

Salman Khan: సల్లూ భాయ్ ఏ దేశమైనా పారిపో.. కానీ లేపేస్తాం?

అందులో విజయకాంత్ ఆరోగ్యం మెరుగుపడిందని, అయినప్పటికీ, గత 24 గంటల్లో ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా లేనందున, పల్మనరీ చికిత్సలో సహాయం కావాలని పేర్కొంది. ఆయన త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నామని వెల్లడించింది. ఇక ఆసుపత్రిలో వైద్యుల అభిప్రాయం ప్రకారం, ఆయనకి ఇంకా 14 రోజులు ఆసుపత్రిలో నిరంతర చికిత్స అవసరం అని తెలుస్తోంది. ఇక అనారోగ్య పరిస్థితుల కారణంగా విజయకాంత్ క్రియాశీలక రాజకీయాల్లో యాక్టివ్ గా లేకున్నా ఆయన భార్య ప్రేమలత విజయ ప్రభాకరన్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. విజయకాంత్ చివరిసారిగా తన పుట్టినరోజు సందర్భంగా డిఎండి ప్రధాన కార్యాలయంలో వాలంటీర్లను కలిశారు. ఆయనను వీల్ చైర్ మీద కూర్చోబెట్టి తీసుకొచ్చి వాలంటీర్లకు చేతులు వంచి కెప్టెన్, కెప్టెన్ అంటూ ఉత్సాహంగా నినాదాలు చేశారు. రీసెంట్ గా దీపావళిని తన కుటుంబంతో కలిసి ఇంట్లో జరుపుకుని సోషల్ మీడియాలో ఆ ఫోటోలు షేర్ చేశాడు విజయకాంత్. ఇక కొన్నాళ్ల క్రితం విలేకరులతో సమావేశమైన మంత్రి ఎం. సుబ్రమణ్యం.. విజయకాంత్‌ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. విజయకాంత్‌కు ఇప్పటికే కిడ్నీ మార్పిడి జరిగిందని, సంబంధిత వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారని కూడా ఆయన తెలియజేశారు. అ