Site icon NTV Telugu

Colors Swathi: విడాకుల బాటలో కలర్స్ స్వాతి?

Colors Swathi

Colors Swathi

కలర్స్ స్వాతి విడాకులు తీసుకోబోతుందా? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. అందుకు ఓ ఫ్రూప్ కూడా చూపిస్తున్నారు. గతంలోనే స్వాతి డివోర్స్ గురించి పుకార్లు వచ్చాయి కానీ అలాంటిదేం లేదని క్లారిటీ ఇచ్చింది స్వాతి. ఇన్‌స్టాగ్రామ్‌లో తన భర్త ఫోటోలు లేకపోవడంతో పుకార్లు పుట్టుకొచ్చాయి. దాంతో తన భర్తతో కలిసి దిగిన ఫోటోలను ఆర్కివ్స్‌లో దాచుకున్నానని, స్వాతి చెప్పడంతో విడాకుల రూమర్స్ ఆగిపోయాయి. ఇప్పుడు ఉన్నట్టుండి.. తన భర్త వికాస్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి స్వాతి తొలగించడం హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే.. గతంలో సమంత, నాగచైతన్యతో విడిపోయేటప్పుడు ఇలాంటి పనే చేసింది. రీసెంట్‌గా మెగా డాటర్ నిహారిక కూడా ఇలాగే చేసింది. ఇక ఇప్పుడు వీళ్ల దారిలోనే స్వాతి కూడా వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది వ్యవహారం. అందుకే స్వాతి విడాకుల బాటలో వెళ్తుందనే టాక్ ఊపందుకుంది. దీంతో మళ్లీ స్వాతి దీని పై క్లారిటీ ఇస్తుందా? లేదంటే.. విడాకులు ప్రకటించి షాక్ ఇస్తుందా? అనేది టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారింది.

యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి, కలర్స్ స్వాతిగా చాలా పాపులర్ అయింది స్వాతి. బుల్లితెరపై పలు ప్రోగ్రామ్స్ చేసిన స్వాతి.. ఆ తర్వాత హీరోయిన్‌గా కూడా అలరించింది. అష్టచమ్మా, స్వామిరారా, కార్తికేయ, త్రిపుర వంటి సినిమాలతో హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది. అయితే 2018 సంవత్సరంలో పైలట్ వికాస్‌ని ప్రేమించి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది స్వాతి. ఇక వివాహం అనంతరం ఈ జంట విదేశాల్లో సెటిల్ అయ్యారు. అప్పటి నుంచి సినిమాలకు దూరమైన స్వాతి.. వైవాహిక జీవితాన్ని బాగానే ఎంజాయ్ చేస్తోంది. కానీ గత కొంతకాలంగా వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని, ఇద్దరూ విడివిడిగానే ఉంటున్నారనే టాక్ నడుస్తోంది. దానికి మరింత బలమిస్తు.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ నుండి భర్త ఫోటోలు డిలీట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. మరి దీనిపై కలర్స్ స్వాతి క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

Exit mobile version