Colors Swathi: విడాకుల బాటలో కలర్స్ స్వాతి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కలర్స్ స్వాతి విడాకులు తీసుకోబోతుందా? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. అందుకు ఓ ఫ్రూప్ కూడా చూపిస్తున్నారు. గతంలోనే స్వాతి డివోర్స్ గురించి పుకార్లు వచ్చాయి కానీ అలాంటిదేం లేదని క్లారిటీ ఇచ్చింది స్వాతి. ఇన్‌స్టాగ్రామ్‌లో తన భర్త ఫోటోలు లేకపోవడంతో పుకార్లు పుట్టుకొచ్చాయి. దాంతో తన భర్తతో కలిసి దిగిన ఫోటోలను ఆర్కివ్స్‌లో దాచుకున్నానని, స్వాతి చెప్పడంతో విడాకుల రూమర్స్ ఆగిపోయాయి. ఇప్పుడు ఉన్నట్టుండి.. తన భర్త వికాస్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ నుంచి స్వాతి తొలగించడం హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే.. గతంలో సమంత, నాగచైతన్యతో విడిపోయేటప్పుడు ఇలాంటి పనే చేసింది. రీసెంట్‌గా మెగా డాటర్ నిహారిక కూడా ఇలాగే చేసింది. ఇక ఇప్పుడు వీళ్ల దారిలోనే స్వాతి కూడా వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది వ్యవహారం. అందుకే స్వాతి విడాకుల బాటలో వెళ్తుందనే టాక్ ఊపందుకుంది. దీంతో మళ్లీ స్వాతి దీని పై క్లారిటీ ఇస్తుందా? లేదంటే.. విడాకులు ప్రకటించి షాక్ ఇస్తుందా? అనేది టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారింది.
యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి, కలర్స్ స్వాతిగా చాలా పాపులర్ అయింది స్వాతి. బుల్లితెరపై పలు ప్రోగ్రామ్స్ చేసిన స్వాతి.. ఆ తర్వాత హీరోయిన్‌గా కూడా అలరించింది. అష్టచమ్మా, స్వామిరారా, కార్తికేయ, త్రిపుర వంటి సినిమాలతో హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది. అయితే 2018 సంవత్సరంలో పైలట్ వికాస్‌ని ప్రేమించి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది స్వాతి. ఇక వివాహం అనంతరం ఈ జంట విదేశాల్లో సెటిల్ అయ్యారు. అప్పటి నుంచి సినిమాలకు దూరమైన స్వాతి.. వైవాహిక జీవితాన్ని బాగానే ఎంజాయ్ చేస్తోంది. కానీ గత కొంతకాలంగా వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని, ఇద్దరూ విడివిడిగానే ఉంటున్నారనే టాక్ నడుస్తోంది. దానికి మరింత బలమిస్తు.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ నుండి భర్త ఫోటోలు డిలీట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. మరి దీనిపై కలర్స్ స్వాతి క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.
Also Read
- Raghav Juyal: 'ది ప్యారడైజ్' ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
- Radha vs Ambika: అబద్ధాలాడుతోంది, నేను కూడా ఫిర్యాదు చేస్తా.. రాధాకు అంబిక వార్నింగ్!
- Dhanush's 'OM' : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ "ఓమ్".. అప్డేట్స్తో జోరు చూపిస్తున్న జైలర్2
- Suriya - Mani Ratnam : 8ఏళ్ల క్రితం నాటి కథతో మణిరత్నం దర్శకత్వంలో సూర్య?
తాజావార్తలు
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
Radha vs Ambika: అబద్ధాలాడుతోంది, నేను కూడా ఫిర్యాదు చేస్తా.. రాధాకు అంబిక వార్నింగ్!
-
Dhanush’s ‘OM’ : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ “ఓమ్”.. అప్డేట్స్తో జోరు చూపిస్తున్న జైలర్2
-
Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
-
Suriya – Mani Ratnam : 8ఏళ్ల క్రితం నాటి కథతో మణిరత్నం దర్శకత్వంలో సూర్య?
ట్రెండింగ్
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!