NTV Telugu Site icon

Save The Tigers S2: కడుపుబ్బా నవ్వించిన సేవ్ ది టైగర్స్ ఫాన్స్ కి గుడ్ న్యూస్

Save The Tigers

Save The Tigers

Save The Tigers S2 Update: తెలుగు వెబ్ సిరీస్ “సేవ్ ది టైగెర్స్” గత ఏడాది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయి మంచి టాక్ తెచ్చుకుంది. ముగ్గురు భార్యాబాధితుల కథతో ఔట్ అండ్ ఔట్ ఫన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సిరీస్ తెరకెక్కింది. ఈ సిరీస్ లో ప్రియదర్శి, చైతన్య కృష్ణ, అభినవ్ గోమటం, సుజాత, దేవయాని అలాగే పావని గంగిరెడ్డి కీలక పాత్రలు పోషించారు. ఈ వెబ్‌సిరీస్‌కు మహి వి. రాఘవ్‌ మరియు ప్రదీప్ అద్వైతం క్రియేటర్లుగా వ్యవహరించగ తేజ కాకుమాను దర్శకత్వం వహించాడు. గత ఏడాది ఏప్రిల్‌లో సేవ్ ది టైగర్స్ సీజన్ వన్‌ రిలీజైంది మంచి హిట్ టాక్ సంపాదించింది. ఈ క్రమంలో ఫస్ట్ సీజన్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సీజన్ 2 ను మేకర్స్ సిద్ధం చేస్తున్నట్టు చాలా కాలం క్రితమే టీం ప్రకటించింది. తాజాగా సేవ్ ది టైగర్స్ సీజన్ 2 గురించి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ ఇచ్చింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ త్వరలోనే సీజన్ 2 స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించింది.

Game Changer:బిగ్ బ్రేకింగ్: అనూహ్యంగా గేమ్ చేంజర్ వాయిదా.. రిలీజ్ డేట్ ఇదే?

బుధవారం మేకర్స్ కొత్త పోస్టర్‌ను కూడా రిలీజ్ చేస్తూ ఒక ఆఫర్ కూడా ప్రకటించారు. దాని ప్రకారం సీజన్ 2 స్ట్రీమింగ్ కి వస్తున్న క్రమంలో మార్చ్ 10 వరకు సీజన్ 1 ను ఫ్రీగా స్ట్రీమ్ చేసుకోవచ్చని ప్రకటించారు. ఇక ప్రియదర్శి, చైతన్యకృష్ణతో పాటు అభినవ్ గోమటం పరుగులు పెడుతుండగా వెనుక వారి భార్యలు పరుగులు పెడుతూ తరముతున్నట్లుగా చూపించారు. ఇక ఈ సేవ్ ది టైగర్స్ సీజన్ 2 అప్డేట్ అయితే ఓటీటీ ఆడియెన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మార్చి ఫస్ట్ వీక్‌లో సేవ్ ది టైగర్స్ సీజన్ 2 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరిగినా ఇప్పుడు వచ్చిన అప్డేట్ ప్రకారం మార్చ్ 10 తర్వాతనే ఈ స్ట్రీమింగ్ ఉండే అవకాశం ఉంది. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది. త్వరలోనే రిలీజ్ డేట్‌ను మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసి అవకాశం ఉంది.