Site icon NTV Telugu

Janhvi Kapoor: ‘సాగర కన్య’గా మారిన అతిలోక సుందరి కూతురు…

Janhvi Kapoor

Janhvi Kapoor

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ సాగరకన్య అవతారం ఎత్తింది. బాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ కపూర్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ ‘దేవర’ సినిమాలో నటిస్తోంది. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీతో జాన్వీ కపూర్ సౌత్ లో మంచి పొజిషన్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ యంగ్ హీరోయిన్ ఇప్పుడు డిస్నీ ఇండియా నుంచి వస్తున్న ‘ది లిటిల్ మెర్మైడ్’ని అందరూ చూడండి అంటూ ప్రమోషన్స్ చేస్తోంది. రాబ్ మార్షల్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ది లిటిల్ మెర్మైడ్’ సినిమాలో ఏరియల్‌గా హాలీ బెయిలీ, ఉర్సులాగా మెలిస్సా మెక్‌కార్తీ, ప్రిన్స్ ఎరిక్‌గా జోనా హౌర్-కింగ్, కింగ్ ట్రిటన్‌గా జేవియర్ బార్డెమ్, సెబాస్టియన్‌గా డేవిడ్ డిగ్స్, ఫ్లౌండర్, ఆక్వాటిల్, నోమాగా జాకబ్ ట్రెంబ్లే నటించారు. డిస్నీ ఇండియా ‘ది లిటిల్ మెర్మైడ్’ని మే 26, 2023న విడుదల చేయనుంది, మరి ఈ యానిమేషన్ మూవీ చిన్న పిల్లలని ఎంత వరకు అట్రాక్ట్ చేస్తుంది అనేది చూడాలి.

Read Also: NTR 31: ఇది కదా మావా… ఫాన్స్ కి కావాల్సిన అనౌన్స్మెంట్

Exit mobile version