వెంకటేష్ తాజా చిత్రం “దృశ్యం 2” వచ్చే వారం అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. నవంబర్ 25న రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ప్రమోషన్లు కూడా ప్రారంభించారు. సినిమా గురించి దగ్గుబాటి ప్రేక్షకులంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా న్యాయపరమైన చిక్కులను ఎదుర్కోబోతోందని సమాచారం. దిగ్గజ ఓటిటి సంస్థ “దృశ్యం 2” మేకర్స్ ను ఇబ్బందుల్లోకి నెట్టబోతోందట.
Read also : పిరికిపంద చర్య… కేంద్రంపై కంగనా ఫైర్
పాపులర్ ఓటిటి డిస్నీ హాట్‌స్టార్ టీం “దృశ్యం 2” నిర్మాతల వృత్తిపరమైన ప్రవర్తనకు వ్యతిరేకంగా చట్టబద్ధంగా లీగల్ యాక్షన్ తీసుకోవాలని యోచిస్తోంది అంటూ ప్రచారం జరుగుతోంది. “దృశ్యం 2″ని మొదట హాట్‌స్టార్‌లో విడుదల చేయాలని అనుకున్నారు, కానీ తరువాత మేకర్స్ దానిని అమెజాన్‌కి మార్చారు. ఇప్పుడు అమెజాన్‌తో ఒప్పందం చేసుకునే ముందు హాట్‌స్టార్‌తో తమ డీల్‌ను రద్దు చేసుకోకపోవడంతో డిస్నీ హాట్‌స్టార్ మేకర్స్ నిర్ణయంతో కలత చెందారట. కాబట్టి రాబోయే రోజుల్లో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు భావిస్తున్నారని అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంత ఉంది అనే విషయం తెలియాలంటే మేకర్స్ స్పందించాల్సిందే. “దృశ్యం 2” చిత్రంలో వెంకటేష్, మీనా ప్రధాన పాత్రలు పోషించారు.
