పిరికిపంద చర్య… కేంద్రంపై కంగనా ఫైర్

దాదాపు ఏడాది కాలంగా ప్రజలు నిరసన వ్యక్తం చేసిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాన మంత్రి మోడీ నిన్న ప్రకటించారు. ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో రాజ్యాంగబద్ధంగా రద్దు ప్రక్రియను పూర్తి చేయనుంది. మోడీ తీసుకున్న నిర్ణయంపై సామాన్య ప్రజలతో పాటు పలువురు సెలెబ్రిటీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినీ ప్రపంచానికి చెందిన పలువురు ప్రముఖులు కూడా సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే కంగనా మాత్రం మోడీ తీసుకున్న నిర్ణయాన్ని సిగ్గు చేటు, పిరికిపంద చర్యగా అభివర్ణిస్తూ ఫైర్ అయ్యింది కంగనా.

Read Also : “తలపతి 66” స్టోరీ లైన్ ఇదే ?

మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కంగనా ‘ఇది విచారకరం, సిగ్గుచేటు, తప్పు’ అని రాసింది… “ఎంచుకున్న ప్రభుత్వం పార్లమెంటులో కూర్చుంటే, వీధుల్లో కూర్చున్న వారు చట్టాలు చేయడం ప్రారంభిస్తే ఇది కూడా జిహాదీ దేశమే… అభినందనలు ఇది చేస్తునం వారందరికీ” అంటూ ఘాటు పోస్ట్ చేసింది. అంతేకాదు ఆనంద్ రంగనాథన్ ట్వీట్‌ను కంగనా తన కథనంలో పెట్టింది. ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాన్ని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. “ఆశ్చర్యకరంగా ఇది పిరికిపంద చర్య… దేశ ప్రగతికి పరాజయం. ప్రతిపక్షాల మాదిరిగానే నరేంద్ర మోదీ కూడా దేశాన్ని దశాబ్దాల వెనక్కి తీసుకెళ్తున్నారు. భారత్ ఓడిపోయింది. అరాచకం విజయం సాధిస్తుంది. గడ్డు రోజులు వస్తున్నాయి” అంటూ ఆ పోస్టులో ఉంది.

మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. “నేనేం చేసినా రైతుల కోసమే చేశాను.. నేను చేసేది దేశం కోసమే.. మీ ఆశీర్వాదంతో నా కష్టాన్ని ఏనాడూ వదలలేదు.. ఈ రోజు నేను మీకు భరోసా ఇస్తున్నాను. నేను ఇప్పుడు మరింత కష్టపడి పని చేస్తాను. తద్వారా మీ కలలు, దేశం కలలు సాకారమవుతాయి. మేము మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నిర్ణయించుకున్నాము. ఈ నెలలో ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాలలో ప్రక్రియను ప్రారంభిస్తాము” అని ప్రధాని మోదీ చెప్పారు.

కంగనా

Related Articles

Latest Articles