NTV Telugu Site icon

Disha Patani : దిశా పటానీ హాలీవుడ్ ఎంట్రీ..షూట్ నుండి పిక్స్ వైరల్

Untitled Design (12)

Untitled Design (12)

అనతి కాలంలోనే తన కంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది బాలీవుడ్ నటి దిశా పటానీ. ముఖ్యంగా తన హాట్ లుక్స్ తో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. ఎలాంటి చిన్న పోస్ట్ పెట్టిన కూడా నిమిషంలో లక్షల్లో లైక్ లు, కామెంట్ లు వస్తాయి. ఇక ఇటీవల ‘కంగువ’, ‘కల్కి’ వంటి భారీ చిత్రంలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. ‘కల్కి’లో దిశ యాక్టింగ్ కు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం బాషా తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తుంది. ఇప్పటి వరకు తీసింది తక్కువ మూవీస్ అయినప్పటికీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌లకు గట్టి పోటి ఇస్తుంది. ఇక ఇప్పుడు హాలివుడ్ లోకి ఎంట్రీ ఇస్తోందట దిశా.

తాజాగా హాలీవుడ్ ‘ఫాస్ట్ అండ్ ప్యూరియస్’ మూవీ నటుడు టైరీస్ గిబ్సన్ తో దిశా ఓ వెబ్ సిరీస్ కోసం జత కట్టినట్లు సమాచారం. ప్రస్తుతం చిత్రీకరణ లో ఉన్న ఈ సిరీస్ సెట్స్ నుంచి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెక్సికోలో షూటింగ్ చేసుకుంటున్న ఈ ప్రాజెక్టు లో నటుడు హ్యారీ గుడ్విన్స్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. మరి బాలీవుడ్ లో కుర్రకారుని ఉర్రూతలూగించిన ఈ ముద్దుగుమ్మ, తన హాట్‌నేస్ తో హాలీవుడ్ లో ఎలాంటి గుర్తింపు సంపాదించుకుంటుందో చూడాలి. ఈ మూవీతో పాటుగా అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించిన ‘వెల్‌కమ్ టు ది జంగిల్’ మూవీలో దిశా పటానీ కూడా కనిపించనుంది. మొత్తానికి చేతి నిండా వరుస ప్రాజెక్ట్‌లతో మంచి ఫామ్ లో ఉంది.