NTV Telugu Site icon

Salaar: సలార్ స్పెషల్ నెంబర్ కోసం ‘డర్టీ గాళ్’

Salaar

Salaar

Dirty hari Simrat Kaur item song in Salaar : ప్రభాస్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియన్ మూవీ సలార్ చాలా కాలం క్రితం షూటింగ్ పూర్తి చేసుకుందని అందరికీ తెలుసు. అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్, సినిమా ఫైనల్ కట్ చూసిన తర్వాత కొన్ని సన్నివేశాలను రీషూట్ చేయాలనుకున్నాడని, అలాగే, సినిమాలో స్పెషల్ సాంగ్‌ని చొప్పిస్తే బాగుంటుందని చిత్రబృందం భావించిందని అంటున్నారు. సినిమా యూనిట్ చాలా మంది నటీమణులతో చర్చించి, అనేక చర్చల తర్వాత, సలార్ ఐటెమ్ సాంగ్‌ చేయాలని భావించారు. ఇక ఈ స్పెషల్ సాంగ్ లో కనిపించడానికి సిమ్రత్ కౌర్ ఎంపికైంది. ఈ భామ ఇప్పటికే తెలుగులో పలు సినిమాలు చేసినా డర్టీ హరి అనే అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది.

Adipurush: టీవీలో దుమ్మురేపిన ఆదిపురుష్

సలార్ ఐటమ్ సాంగ్ లో సిమ్రత్ కౌర్ కనిపించనుందని అంటున్నారు. సిమ్రత్ కౌర్‌తో సాలార్ ఐటెం సాంగ్ షూటింగ్ ప్రారంభమైంది, RFC (రామోజీ ఫిల్మ్ సిటీ)లో మరో మూడు రోజుల పాటు కొనసాగుతుంది. ఈ పాటతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. డిసెంబర్ మొదటి వారంలో ఫస్ట్ కాపీ రెడీ అవుతుందని, డిసెంబర్ 1న టీజర్ రిలీజ్ చేసేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారు అని అంటున్నారు. ఇక ఈ భారీ యాక్షన్ చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. KGF సిరీస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సలార్ ను హోంబాలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో శృతి హాసన్, జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీ రావు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

Show comments