హైదరాబాద్ శిల్పకళావేదికలో నేచురల్ స్టార్ నాని నటించిన ‘అంటే సుందరానికీ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ ఈవెంట్‌కు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ.. తమ సినిమా వేడుకకు పవన్ కళ్యాణ్ రావడం కంటే పెద్ద సెలబ్రేషన్ ఏముంటుందని వ్యాఖ్యానించారు. అంటే సుందరానికీ సినిమాకు పనిచేసిన సహాయ దర్శకులు రాత్రి, పగలు తేడా లేకుండా పనిచేశారని.. వారిలో ఏ ఒక్కరూ లేకపోయినా ఈ సినిమా లేదని వివేక్ ఆత్రేయ తెలిపారు.
సాధారణంగా తనకు తాను ఎప్పుడూ గర్వంగా ఫీలవనని.. కానీ జాబ్ వదిలి సినిమాల్లోకి వచ్చినప్పుడు తాను ఇక్కడ రాణిస్తాననే గర్వం వచ్చిందని వివేక్ ఆత్రేయ వెల్లడించాడు. మళ్లీ ఈ సినిమా ఫస్ట్ కాపీని చూసినప్పుడు కూడా తనకు గర్వకారణంగా ఉందన్నాడు. హీరో నాని స్క్రిప్ట్ ఓకే చేయకపోతే ఈరోజు ఈ మూవీ ఇక్కడికి వచ్చుండేది కాదన్నాడు. ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్‌లు అందరికీ స్పెషల్‌గా థ్యాంక్స్ తెలిపాడు. ముఖ్యంగా ఎడిటర్ రవి, తాను కొట్టుకోవడం ఒక్కటే తక్కువ అని గుర్తుచేసుకున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చితక్కొట్టాడని ప్రశంసలు కురిపించాడు. ఈ మూవీ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని కానీ ఇలాంటి అన్‌కన్వెన్షన్ స్క్రిప్టును చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు మైత్రీ మూవీస్ బ్యానర్ కు ధన్యవాదాలు తెలియజేశాడు.
ఇక పవర్‌స్టార్ గురించి ఏం చెప్పాలో అర్థం కావడం లేదని.. మనకు జీవితంలో కొన్ని మరపురాని క్షణాలు ఉంటాయని.. 1999 వరల్డ్ కప్‌లో ఇండియా ఆస్ట్రేలియాను ఓడించినప్పుడు.. ప్రపంచకప్ గెలిచినప్పుడు ఎలాంటి అనుభూతి కలిగిందో ఇప్పుడు కూడా తనకు అలాంటి అనుభూతే కలుగుతుందన్నాడు. తాను చదువుకునే రోజుల్లో ఓ ఏడాది సమ్మర్ హాలీడేస్‌కు తన బామ్మ వాళ్ల ఇంటికి నర్సరావుపేట వెళ్లినప్పుడు రోడ్లన్నీ ఖాళీగా కనిపించాయని.. దాదాపుగా ఇటీవల లాక్‌డౌన్ పెట్టినప్పుడు ఎలాంటి వాతావరణం నెలకొందో అప్పుడు కూడా అలాంటి వాతావరణమే కనిపించిందని.. దీంతో ఏం జరిగిందని తన వాళ్లను అడిగితే.. ఆరోజు పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమా టీవీలో టెలికాస్ట్ చేస్తున్నారని చెప్పారని.. దీంతో తాను ఆశ్చర్యపోయానని దర్శకుడు వివేక్ ఆత్రేయ తెలిపాడు.
https://www.youtube.com/watch?v=ER5ifhJ_yzk
