Site icon NTV Telugu

Venky Atluri: డైరెక్టర్ ‘సార్’ పెళ్లి అయిపొయింది…

Venky Atluri

Venky Atluri

యంగ్ హీరో శర్వానంద్ ఎంగేజ్మెంట్ విషయం మర్చిపోయేలోపు టాలీవుడ్‌ లో మరో పెళ్లి న్యూస్ బయటకి వచ్చేసింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘తొలిప్రేమ’ సినిమాతో మంచి హిట్ కొట్టిన యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి, ‘పూజ’ల వివాహం ఈరోజు ఘనంగా జరిగింది. హీరో నితిన్‌, కీర్తిసురేష్‌, దర్శకుడు వెంకీ కుడుములతో పెళ్లి జంట దిగిన ఫోటో సోషల్ మీడియాలోకి రావడంతో వెంకీ అట్లూరి పెళ్లి విషయం అందరికీ తెలిసింది. తక్కువ మంది గెస్టులతో, తన సన్నిహితుల మధ్య పూజాతో వెంకీ అట్లూరి పెళ్లి జరిగింది. ప్రస్తుతం హీరో ధనుష్ తో ‘సార్’ సినిమా చేస్తున్న వెంకీ అట్లూరి, దర్శకుడి కన్నా ముందు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 2010లో మధుర శ్రీధర్ డైరెక్ట్ చేసిన ‘స్నేహగీతం’ సినిమాలో ఒక హీరోగా వెంకీ అట్లూరి నటించాడు. ఆ తర్వాత దర్శకుడిగా మారి ‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’, ‘రంగ్ దే’ సినిమాలు చేశాడు. మూడు సినిమాల్లో ఒక హిట్, ఒక యావరేజ్, ఒక ఫ్లాప్ ఇచ్చాడు వెంకీ అట్లూరి. ధనుష్ తో చేస్తున్న సార్ సినిమాతో తెలుగు, తమిళ భాషల్లో సాలిడ్ హిట్ కొట్టి స్టార్ దర్శకుల లీగ్ లోకి వెళ్లాలని చూస్తున్న వెంకీ అట్లూరి, ఫిబ్రవరి 17న తన లక్ టెస్ట్ చేసుకోనున్నాడు.

Read Also:Sharukh Khan: ‘జవాన్’గా మారిన ‘పఠాన్’

Exit mobile version