Akkineni Nagarjuna: ఏ రంగంలో అయినా జయాపజయాలు సాధారణమే. కానీ, చిత్ర పరిశ్రమలో మాత్రం ఆ అపజయాల వెనుక చాలా కారణాలు ఉంటాయి. కొన్నిసార్లు చాలామంది వ్యక్తులు కూడా ఉంటారు. ముఖ్యంగా ఒక సినిమాలు ప్లాప్ అయ్యింది అంటే.. ఆ ప్లాప్ కు కారణం కథ, హీరో, డైరెక్టర్.. ఇలా చాలా కారణాలు ఉంటాయి. కొన్నిసార్లు కథ బావున్నా.. టేకింగ్ బాగా రాకపోవచ్చు. హీరోలు కథలలో కొన్ని మార్పులు, చేర్పులు చేయడం వలన అది మొదటికే మోసం జరగొచ్చు. ఇలాంటి ఘటనలు ఇండస్ట్రీలో చాలానే చూసాం. తాజాగా ఒక సీనియర్ దర్శకుడు.. తన కెరీర్ నాశనం కావడానికి ఒక హీరో కారణమని చెప్పుకొస్తున్నాడు. అతను ఎవరో కాదు.. వీరభద్ర చౌదరి. అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన అహ నా పెళ్ళంట సినిమాతో ఆయన ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఇక ఈ సినిమా తరువాత సునీల్ తో పూలరంగడు సినిమాను తెరకెక్కించి కామెడీహిట్ ను అందుకున్నాడు. ఇలా కామెడీ సినిమాలతో సాగుతున్న ఆయన కెరీర్ లో అక్కినేని నాగార్జున తో పనిచేసే అవకాశం లభించింది. అదే భాయ్. నాగార్జున, రిచా గంగోపాధ్యాయ జంటగా నటించిన ఈ చిత్రం 2013 లో రిలీజ్ అయ్యి భారీ డిజాస్టర్ ను అందుకుంది. ఇక ఆ దెబ్బ ఎక్కడివరకు తగిలింది అంటే.. డైరెక్టర్ వీరభద్ర చౌదరి ఇప్పటికీ కోలుకోలేకుండా మారాడు. చాలా యెల్లఁ తరువాత అయన మీడియా ముందుకు వచ్చారు. ఒక ఇంటర్వ్యూలో పాల్గున్న ఆయన భాయ్ ప్లాప్ గురించి చెప్పుకొచ్చి బాధపడ్డాడు.
Kajol: కాజోల్ కీలక నిర్ణయం.. వాటిని తట్టుకోలేకనే ఇలా
” నేను భాయ్ కథను ఒక కామెడీ కథగా రాసుకున్నాను. ముందు ఆ కథకు హీరో నాగార్జున అని తెలియదు. ఇక స్టార్ హీరో తో సినిమా అనేసరికి కథలో మార్పులు చేర్పులు చేయించారు. దీంతో సినిమా అంతా మిస్ ఫైర్ అయ్యింది. ప్రేక్షకులు ఆ సినిమాను ఆదరించలేదు. ఆ సినిమా తీసిన దెబ్బకు ఇప్పటికీ నేను కోలుకోలేకుండా ఉన్నాను. ఆకాశం లో విమానంలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తిని కిందకు తోసేసినట్లు అనిపిస్తుంది. ఒకవిధంగా నేను ఇలా ఉండడానికి కారణం నాగార్జున సినిమానే. ఆయన సినిమా వలనే నా కెరీర్ నాశనం అయ్యింది. సినిమా ప్లాప్ తరువాత డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
