Director Vassishta Post about Vishwambhara Goes Viral: బింబిసార అనే సినిమాతో దర్శకుడిగా మారిన వశిష్ట ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా చేస్తున్నాడు. ఏకంగా రెండో సినిమాకే మెగాస్టార్ చిరంజీవి డైరెక్ట్ చేసే అవకాశం రావడంతో ఎక్కడ పొరపాటు చేస్తానో, అనుకుంటున్నాడో ఏమో తెలియదు కానీ ఎప్పటికప్పుడు చాలా పగడ్బందీగా షూట్ ప్లాన్ చేసుకుంటున్నాడు. అందులో భాగంగానే తాజా షెడ్యూల్ ఒకటి హైదరాబాద్ కి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోచంపల్లి అనే ప్రాంతంలో జరుగుతోంది. పూర్తి స్థాయిలో సెట్స్ ఏర్పాటు చేసి అక్కడ షూట్ చేస్తున్నారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లడంతో అక్కడి నుంచి కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. పెద్ద ఆంజనేయస్వామి విగ్రహం ముందు నిలబడి మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు జనసేనకు చెందిన కొందరు ఫోటోలు దిగారు.
జనసేనకు చిరంజీవి 5 కోట్ల విరాళం.. కాళ్లపై పడ్డ పవన్ (ఫోటోలు)
అవి మీడియాకి రిలీజ్ అయ్యాయి. అయితే ఎలాగో ఆంజనేయస్వామి విగ్రహానికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చేశాయి కదా అని దర్శకుడు వశిష్ట కూడా దాని ఫోటోను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఆంజనేయ స్వామి విగ్రహం ముందు కత్తులు గాల్లోకి ఎగుడుతున్నట్టుగా ఉన్న ఒక ఫోటోని ఆయన షేర్ చేసి ధర్మ యుద్ధం మొదలు!!! విశ్వంభర విజృంభణం అంటూ ఆయన రాసుకొచ్చారు. ఇక మెగాస్టార్ చిరంజీవి సరసన ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో కొన్ని సీన్స్ కూడా షూట్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన షెడ్యూల్ పోచంపల్లిలో వేసిన ప్రత్యేకమైన సెట్స్ లో షూట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ ఇప్పటికే ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన సంక్రాంతి సందర్భంగా రివ్యూ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ధర్మ యుద్ధం మొదలు!!! విశ్వంభర విజృంభణం 🔥🔥🔥 pic.twitter.com/7g1CcajjLU
— Vassishta (@DirVassishta) April 8, 2024