NTV Telugu Site icon

Director Ubaini: సినిమాకు నెగెటివ్ రివ్యూ ఇచ్చారని ఆ పని చేసిన డైరెక్టర్..

Director

Director

Director Ubaini: సినిమా అంటే ఫస్ట్ గుర్తొచ్చేది హీరో హీరోయిన్లు.. కానీ సినిమాకు కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటే డైరెక్టర్ మాత్రమే. కథను రాసుకొని.. అందరికి నచ్చేలా సినిమాను తెరకెక్కిస్తాడు. అయితే సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందా.. ? లేదా.. ? అనేది మాత్రం వారికే తెలియాలి. ఒక సినిమా రిలీజ్ అయ్యిందంటే కొంతమందికి సినిమా నచ్చుతుంది.. మరికొంతమందికి సినిమా నచ్చదు. ఈ మధ్య కాలంలో నెగెటివ్ రివ్యూలు ఇచ్చేవారు ఎక్కువగా తయారయ్యారు. వీరిపై ఎవరు రియాక్ట్ అవ్వరు కదా అని తమకు నచ్చిన్నట్లు సినిమాపై రివ్యూలు ఇస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. మిగతావారిని కూడా సినిమా చూడనివ్వకుండా చేస్తున్నారు. ఈ నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నవారిని మాత్రం ఎవరు ఆపలేకపోతున్నారు. అయితే తాజాగా ఈ నెగెటివ్ రివ్యూలపై మండిపడ్డ ఒక డైరెక్టర్.. ఏ డైరెక్టర్ చేయలేని పనిచేశాడు. నెగెటివ్ రివ్యూలు ఇస్తున్న కొంతమందిపై పోలీస్ కేసు పెట్టాడు.

Arjun Sarja: గ్రాండ్ గా అర్జున్ కుమార్తె నిశ్చితార్థం..

ఇక ఆ డైరెక్టర్ పేరు.. ఉబైని. ఆయన దర్శకత్వం వహించిన సినిమా రహీల్ మకన్ కోరా. అక్టోబర్ 13 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాపై అదేరోజు పలువురు నెగిటివ్ రివ్యూలు ఇస్తూ యూట్యూబ్ లో, ఫేస్ బుక్ లో వీడియోలు, కంటెంట్ పోస్ట్ చేశారు. దీనిపై డైరెక్టర్ ఉబైని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన సినిమాపై కావాలని నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారని, తన సినిమా గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా ఏ సినిమాకు కూడా వారం రోజులు దాటకుండా రివ్యూలు ఇవ్వకూడదని చెప్పుకొచ్చాడు. ఇక డైరెక్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారించి 9 మందిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. మరి ఇదే పని తెలుగు డైరెక్టర్స్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో దేవుడికే వదిలేయాలి.