NTV Telugu Site icon

Trivikram: సూపర్ స్టార్ కోసం త్రివిక్రమ్ సెంటిమెంట్ బ్రేక్…

Ssmb 28 Guntur Kaaram

Ssmb 28 Guntur Kaaram

అతడు, ఖలేజా లాంటి సినిమాల తర్వాత దాదాపు పుష్కర కాలానికి సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ సెట్ అయింది. ‘ఎస్ఎస్ఎంబీ 28’ అనే వర్కింగ్ టైటిల్‌తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీని హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోంది. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా టైటిల్ ని ‘గుంటూరు కారం’గా ఫిక్స్ చేసి మేకర్స్ మాస్ స్ట్రైక్ అనే వీడియోని కూడా రిలీజ్ చేసారు. ఘట్టమనేని అభిమానులకి ఫుల్ మీల్స్ పెడుతూ, సోషల్ మీడియాలో ఈ వీడియో సెన్సేషనల్ వ్యూస్ రాబడుతోంది.

SSMB 28 సినిమాకి గుంటూరు కారం టైటిల్ అనౌన్స్ చేస్తూ త్రివిక్రమ్ గత ఏడేళ్లుగా తను ఫాలో అవుతున్న సెంటిమెంట్ ని బ్రేక్ చేసాడు. త్రివిక్రమ్ సినిమా అనగానే ‘అ’ లేదా ‘ఆ’ అనే అక్షరంతో టైటిల్ ఉంటుందని ఆల్మోస్ట్ అందరూ ఫిక్స్ అయిపోయారు. జల్సా, జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి సినిమాల కోసం త్రివిక్రమ్ తన సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన సందర్భాలు గతంలో కూడా ఉన్నాయి కానీ 2016 నుంచి మాత్రం ఈ సెంటిమెంట్ ని బ్రేక్ చేయకుండా వస్తున్నాడు త్రివిక్రమ్. అందుకే SSMB 28 సినిమాకి కూడా ‘అ’ సెంటిమెంట్‌లో భాగంగా.. అర్జునుడు, అయోధ్యలో అర్జునుడు… లాంటి టైటిల్ వినిపించాయి. అవేమి కాకుండా ‘గుంటూరు కారం’ టైటిల్ ని ఫైనల్ చేయడం విశేషం. అయితే త్రివిక్రమ్ సెంటిమెంట్ ని ఫాలో అయినప్పుడు అజ్ఞాతవాసి మాత్రమే ఫ్లాప్ అయ్యింది. అతడు థియేటర్స్ లో ఆడకపోయినా కల్ట్ స్టేటస్ సంపాదించుకుంది. మరి గుంటూరు కారం విషయంలో ఏం జరుగుతుందో తెలియాలి అంటే 2024 సంక్రాంతి వరకూఆగాల్సిందే.

Show comments