Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Director Surender Reddy Birthday Special

వైవిధ్యంతో సాగుతున్న సురేందర్ రెడ్డి

Published Date :December 7, 2021 , 6:00 am
By Roja Pantham
వైవిధ్యంతో సాగుతున్న సురేందర్ రెడ్డి
  • Follow Us :
  • google news
  • dailyhunt

నవతరం దర్శకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకొని సక్సెస్ రూటులో సాగిపోతున్నారు సురేందర్ రెడ్డి. తొలి చిత్రం ‘అతనొక్కడే’ మొదలు మొన్నటి ‘సైరా…నరసింహారెడ్డి’ దాకా తన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక వైవిధ్యం చూపించే ప్రయత్నం చేశారు సురేందర్ రెడ్డి.

కరీంనగర్ జిల్లా మాచంపల్లి సురేందర్ రెడ్డి స్వగ్రామం. 1975 డిసెంబర్ 7న సురేందర్ రెడ్డి జన్మించారు. ఆయన తండ్రి వీరారెడ్డి వారి గ్రామానికి సర్పంచ్ గా ఉండేవారు. సురేందర్ రెడ్డికి చిన్నప్పటి నుంచీ సినిమాలంటే ఆసక్తి ఉండేది. డిగ్రీ చదువుతూ ఆపేసి, హైదరాబాద్ చేరి కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. క్రాంతికుమార్ వద్ద అసోసియేట్ గా ఉన్నారు. తరువాత సొంతగా ‘అతనొక్కడే’ సబ్జెక్ట్ తయారు చేసుకొని, నందమూరి కళ్యాణ్ రామ్ కు వినిపించారు. కళ్యాణ్ తానే నిర్మాతగా ఆ చిత్రాన్ని నిర్మిస్తూ నటించారు. ఈ చిత్రంలో సురేందర్ రెడ్డి టేకింగ్ జనాన్ని భలేగా ఆకట్టుకుంది.

కళ్యాణ్ రామ్ కు తొలి హిట్ గా ‘అతనొక్కడే’ నిలచింది. మొదటి సినిమాతోనే విజయం సాధించిన సురేందర్ కు మంచి అవకాశాలు లభించాయి. రెండవ చిత్రమే జూనియర్ యన్టీఆర్ తో తెరకెక్కించే ఛాన్స్ దక్కింది. జూనియర్ యన్టీఆర్ తో ‘అశోక్’, తరువాత మహేశ్ బాబుతో ‘అతిథి’ రూపొందించారు. రవితేజ, ఇలియానా జంటగా సురేందర్ తెరకెక్కించిన ‘కిక్’ మంచి విజయం సాధించింది. మళ్ళీ జూనియర్ యన్టీఆర్ తో ‘ఊసరవెల్లి’ రూపొందించారు సురేందర్ రెడ్డి. ఆ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అల్లు అర్జున్ తో ఆయన రూపొందించిన ‘రేసు గుర్రం’ బంపర్ హిట్ అయింది.

రవితేజ హీరోగా ‘కిక్-2’ చిత్రాన్ని తన తొలి నిర్మాత కళ్యాణ్ రామ్ నిర్మించగా, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. అది అంతగా ఆకట్టుకోలేకపోయింది. తమిళంలో విజయం సాధించిన ‘తని ఒరువన్’ ఆధారంగా రామ్ చరణ్ తో ‘ధ్రువ’ రూపొందించారు సురేందర్. ఈ సినిమా సమయంలోనే రామ్ చరణ్ తో సురేందర్ రెడ్డికి మంచి అనుబంధం కుదిరింది. దాంతో తన తండ్రి చిరంజీవి హీరోగా తాను నిర్మిస్తోన్న చారిత్రక చిత్రం ‘సైరా…నరసింహారెడ్డి’కి సురేందర్ రెడ్డిని దర్శకునిగా ఎంచుకున్నారు రామ్ చరణ్. ‘సైరా…’ రూపకల్పనలో దర్శకునిగా సురేందర్ మంచి మార్కులే సంపాదించారు. ప్రస్తుతం అక్కినేని అఖిల్ హీరోగా ‘ఏజెంట్’ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంతో ఏ తీరున సురేందర్ రెడ్డి జనాన్ని అలరిస్తారో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • atanokkade
  • birthday special
  • Director Surender Reddy
  • happy birthday
  • kick

తాజావార్తలు

  • Sajjala Ramakrishna Reddy: అమరావతి బిల్లు పాసయితే దేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్టు సంబరాలా..?

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Congress: రాహుల్ గాంధీకి సొంత పార్టీలోనే షాక్.. మోడీ సర్కార్‌కు కాంగ్రెస్ సీనియర్ల మద్దతు..

  • US-Iran War: “మేము మీలా క్రూరులం కాదు”.. అమెరికన్ పైలట్ తల్లి బాధపై స్పందించిన ఇరాన్..

  • SRH: సన్ రైజర్స్ హైదరాబాద్‌కు బిగ్ షాక్.. ఇంటికెళ్లిపోయిన స్టార్ ప్లేయర్..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions