Site icon NTV Telugu

ఆమెకు సాయం చేయమన్న రాజమౌళి.. నువ్వేం చేశావ్ అంటున్న నెటిజన్స్

rajamouli

rajamouli

తెలుగు చిత్రపరిశ్రమను పాన్ ఇండియా లెవెల్లో నిలబెట్టిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి దగ్గర నుంచి ఆర్ఆర్ఆర్ వరకు తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన దర్శక ధీరుడు ప్రస్తుతం నెటిజన్ల చేత విమర్శలపాలు అవుతున్నాడు. ఎందుకంటే.. ఆయన చేసిన ఒక ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అసలు ఏం జరిగిందంటే.. తాజగా రాజమౌళి ఒక ట్వీట్ చేశాడు. అందులో దేవిక అనే మహిళ బ్లడ్ క్యాన్సర్ తో పోరాడుతుందని, ఆమె పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులకు కో ఆర్డినేటర్‌గా పనిచేస్తుందని, ఆమెతో కలిసి బాహుబలి చిత్రానికి తాను పనిచేసినట్లు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా పని పట్ల ఆమెకున్న డెడికేషన్‌ గురించి మాటల్లో చెప్పలేనని, దురదృష్టవశాత్తు ఆమె బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతుంది. దయచేసి ఆమెకు సాయం చేయడానికి ముందుకు రండి అంటూ ఒక లింక్ షేర్ చేసి ఫండ్ రైజింగ్ చేయాల్సిందిగా వేడుకున్నారు”.

ఇక ఈ ట్వీట్ తో రాజమౌళి నెటిజన్స్ చేతికి చిక్కాడు. ఒక్కో సినిమా బడ్జెట్ కోట్లల్లో ఉంటుంది.. మీ రెమ్యూనిరేషన్ కూడా బాగానే తీసుకొంటారు. మీ దగ్గర కలిసి పనిచేసిన ఆమెకు సహాయం చేయడానికి ఫండింగ్ అడుగుతున్నారా..? రూ .3 కోట్లు మీకు లెక్కా.. మీరే ఆమెకు సహాయం చేయొచ్చు కదా.. అంటూ నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అంతేకాకూండా ఆన్ లైన్ ఫండింగ్ అడుగుతున్నారు ముందు మీరెంత డొనేట్ చేశారో చెప్పండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ ట్రోలింగ్ పై జక్కన్న ఎలా స్పందిస్తాడో చూడాలి.

Exit mobile version