NTV Telugu Site icon

Rishvi Thimmaraju: పల్లెటూరి ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’!

Krishna1

Krishna1

‘Krishna Gadu Ante Oka Range’: కొత్త హీరో హీరోయిర్లు అయిన రిష్వి తిమ్మరాజు, విస్మయశ్రీ లను పరిచయం చేస్తూ ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’ అనే సినిమాను పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన రాజేష్ దొండపాటి ఈ మూవీతో డైరెక్టర్‌గా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను ఇప్పటికే మొదలయ్యాయి. ఆ మధ్య డైనమిక్ డైరెక్టర్ వి.వి. వినాయక్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇక ఉగాది సందర్భంగా ఈ చిత్ర యూనిట్ మరో అప్డేట్ గా ఈ మూవీ టీజర్‌ను వదిలింది.
Krishna2

డైరెక్టర్ శ్రీవాస్ రిలీజ్ చేసిన ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’ టీజర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. రెండు నిమిషాలకు పైగా ఉన్న ఈ టీజర్‌లో కామెడీ, రొమాన్స్, యాక్షన్… ఇలా అన్ని జానర్లను చూపించారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఇంటెన్స్ లవ్ స్టోరీలా ఇది కనిపిస్తోంది. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్ అవుతాయని ఈ టీజర్ చూస్తే అర్థమౌతోంది. ఈ టీజర్‌లో సాబు వర్గీస్ నేపథ్య సంగీతం ఆకట్టుకునేలా ఉంది. రఘు, స్వాతి పొలిచర్ల, సుజాత, వినయ్ మహదేవ్ వంటి తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు వరికుప్పల యాదగిరి పాటలు రాశారు. అతి త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు.