NTV Telugu Site icon

VFX : ‘కల్పర వీఎఫ్ఎక్స్ అండ్ ఏఐ’ సర్వీసెస్ ను ప్రారంభించిన దర్శకులు శ్రీను వైట్ల

Vfx

Vfx

సినిమా ఇండస్ట్రీలోకి వీఎఫ్‌ఎక్స్‌కు అధిక ప్రాధాన్యత ఏర్పడింది. ఫిల్మ్ మేకర్స్ అంతా టెక్నాలజీని ఉపయోగిస్తూ వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. తాజాజా హైదరాబాద్‌లో కల్పర వీఎఫ్‌ఎక్స్ అండ్ ఏఐ టెక్నాలజీ తమ నూతన బ్రాంచ్‌ను హైదరాబాద్‌లో లాంచ్ చేశారు డాక్టర్ మల్లీశ్వర్. ఈ వేడుక శుక్రవారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్స్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు , దర్శకులు శ్రీనువైట్ల , కరుణ కుమార్, ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ డైరెక్టర్ వందన, నటులు విక్రాంత్ రెడ్డి, రఘు కుంచె హాజరయ్యారు.

Also Read : The RajaSaab : సంక్రాంతికి కొత్త రాజా సాబ్.?

దర్శకులు శ్రీనువైట్ల మాట్లాడుతూ ‘మల్లీశ్వర్ మంచి ఆలోచనతో వీఎఫ్‌ఎక్స్‌తో పాటు ఏఐ బ్రాంచ్‌ను ఇక్కడ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో తమ వంతుగా పాలుపంచుకోవడంతో పాటు అనేక మందికి ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వడం సంతోషంగా ఉంది. సినిమా ఇండస్ట్రీలో ఆయనకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.

Also Read : Game Changer : గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఆ రెండు సినిమాలు ఔట్

కల్పర వీఎఫ్ఎక్స్ అండ్ ఏఐ సర్వీసెస్ సీఈవో డాక్టర్ మల్లీశ్వర్ మాట్లాడుతూ ‘ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ వెరీ మచ్. యూఎస్‌లో నాకు ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఏఐ ద్వారా కొన్ని ప్రొడక్ట్స్ డెవలెప్ చేశాం. సినీ పరిశ్రమలోనూ అడుగుపెట్టాలని అనుకున్నాం. వీఎఫ్‌ఎక్స్‌కు ప్రాధాన్యత ఇచ్చే చిత్రాలు ఎక్కువ అవుతున్నాయి. దీంతో  హైదరాబాద్ లో బ్రాంచ్‌ను ఏర్పాటు చేస్తున్నాం. హాలీవుడ్‌లో వాడే టెక్నాలజీని ఇక్కడ కూడా పరిచయం చేస్తున్నాం. ఈ టెక్నాలజీ ఎంతవరకు ఉపయోగపడుతుందో దర్శకులు రాజమౌళి గారు, నాగ్ అశ్విన్ గారికి తెలుసు. తక్కువ బడ్జెట్‌ సినిమాలకు కూడా ఈ టెక్నాలజీ ఉపయోగపడాలని మేం అనుకున్నాం. టాలీవుడ్‌తో పాటు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తమవంతు పాత్ర పోషిస్తాం. నా ఈ ప్రయాణంలో నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ’ అని అన్నారు.

Show comments