Site icon NTV Telugu

Shahrukh Khan: ‘పఠాన్’ లో షారూఖ్ 8 ప్యాక్స్ బాడీ.. రక్తం చిందించాడు

Pathan

Pathan

Shahrukh Khan: బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్‌ డెడికేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పాత్రకు తగ్గట్టు మారిపోవడంలో షారుఖ్ ఎప్పుడు ముందుంటాడు. ఇక ఈ హీరో తన కొత్త చిత్రం పఠాన్ కోసం చాలా కష్టపడాడట. ముఖ్యంగా తన ఫిజిక్ కోసం అయితే రక్తం చిందించాడని దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో షారుఖ్ సరసన దీపికా పడుకొనే నటిస్తోంది. ఇటీవలే రిలీజ్ అయినా ఈ టీజర్ ప్రేక్షకులను విజహసంగా ఆకట్టుకొంది. ఇక ఈ సినిమా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 25న హిందీ, త‌మిళ్‌, తెలుగులో విడుద‌ల కానుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ద‌ర్శ‌కుడు సిద్ధార్థ్ మాట్లాడుతూ” ప‌ఠాన్‌లో షారుఖ్ చూపించిన ఫిజిక్ కోసం ఆయ‌న ఎంతో కృషి చేశారు. ఆయ‌న క‌ష్టానికి ఫ‌లితం ద‌క్కింది. టీజ‌ర్ చూసిన ప్ర‌తి ఒక్క‌రూ షారుఖ్ ను ప్ర‌శంసిస్తున్నారు. ఈ సినిమా కోసం నేను తొలిసారి షారుఖ్‌ని క‌లిసిన‌ప్పుడు జ‌రిగిన సంభాష‌ణ నాకు ఇంకా గుర్తుంది. శారీర‌కంగా ఈ సినిమా కోసం ఆయ‌న ఎంత క‌ష్ట‌ప‌డాలో మాట్లాడుకున్నాం. ఆయ‌న ప్ర‌తి ప‌దాన్ని గుర్తుంచుకున్నారు. ఆచ‌ర‌ణ‌లో పెట్టారు. ఇవాళ దాని ఫ‌లితం స్క్రీన్ మీద క‌నిపిస్తోంది.

ఇక యాక్షన్ సీక్వెన్స్ గురించి చెప్పాలంటే.. సినిమా చూసే ప్ర‌తి ఒక్క‌రిలోనూ ఓ ఉత్సాహం రావాలి. త‌న‌ను చూస్తున్నంత‌సేపు ఆ ఉర‌క‌లు వేసే ఉత్సాహం ఆడియ‌న్స్ లో కూడా చూడాలనేది షారుఖ్ కోరిక. అందుకోసమే అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన స్టంట్లు, ప్ర‌మాద‌క‌ర‌మైన ప్ర‌దేశాల్లో, ప్ర‌మాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణంలో ఆయన చేసిన యాక్ష‌న్ సీక్వెన్స్ కి థియేట‌ర్ల‌లో మ‌రో రేంజ్ అప్లాజ్ ద‌క్కి తీరుతుంది. ఇంత క‌ష్ట‌మైన స్టంట్స్ కోసం ఆయన తన 8 ప్యాక్స్ బాడీని సిద్ధం చేశాడు. షారుఖ్‌ని స్క్రీన్ మీద చూసిన ప్ర‌తి ఒక్క‌రికీ ఆయ‌న పడిన కష్టం అర్థ‌మ‌వుతుంది. మేం డిజైన్ చేసిన యాక్ష‌న్ సీక్వెన్స్ ని నిజం చేయ‌డానికి ఆయ‌న తీసుకున్న శ్ర‌మ‌కు ఫిదా అయిపోయాం. షారుఖ్‌లాగా ఇంకెవ‌రూ ఉండ‌రు. సినిమాల ప‌ట్ల ఆయ‌న‌కు ఉండే అంకిత‌భావం, ప్రేమ‌ను అర్థం చేసుకోవాలంటే ప‌ఠాన్ విడుద‌ల‌య్యే వ‌ర‌కు ఆగాల్సిందే” అని చెప్పుకొచ్చాడు.

Exit mobile version