NTV Telugu Site icon

Blood & Chocolate: లెజండరీ డైరెక్టర్ శంకర్ చేతుల మీదుగా ‘బ్లడ్ అండ్ చాక్లెట్’ ఆడియో రిలీజ్

Blood And Chocolate Audio Released

Blood And Chocolate Audio Released

Director Shankar Releases Blood and Chocolate audio: లెజెండరీ డైరెక్టర్ శంకర్ సొంతంగా ప్రొడక్షన్స్ ప్రారంభించి ఎస్ పిక్చర్స్ బ్యానర్ పేరుతో ప్రేమిస్తే, వైశాలి, షాపింగ్ మాల్ లాంటి సినిమాలు నిర్మించగా అవన్నీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అదే పంథాలో డైరెక్టర్ శంకర్ ప్రొడక్షన్ లో మొదటి సారి సస్పెన్స్ థ్రిల్లర్ గా బ్లడ్ అండ్ చాక్లెట్ సినిమాను రూపొందించారు. షాపింగ్ మాల్, ఏకవీర లాంటి సెన్సిబుల్ సినిమాలు రూపొందించి, జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకున్న వసంత బాలన్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఖైదీ, మాస్టర్, విక్రమ్ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందిన అర్జున్ దాస్ హీరోగా, దుశారా విజయన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఆడియోను డైరెక్టర్ శంకర్ తాజాగా విడుదల చేశారు.

Preview vs Prevue: జవాన్ ప్రెవ్యూ రిలీజ్.. ఇంతకీ ప్రెవ్యూ అంటే ఏంటో తెలుసా?

ఇక ఈ సినిమాకి జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆడియో విడుదల సందర్భంగా డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ ‘వసంతబాలన్ సెన్సిటివ్ సబ్జెక్ట్ లు డీల్ చేస్తు ఉంటారు, ఈ సినిమా చూడగానే నాకు చాలా బాగా నచ్చిందని అన్నారు. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్న శంకర్ వసంతబాలన్ సెన్సిటివ్ కథాంశాన్ని టచ్ చేస్తూ, ఒక వైపు లవ్ మరో వైపు సస్పెన్స్ రెండింటికి సమ న్యాయం చేస్తూ అద్భుతంగా రూపొందించారని అన్నారు. ఇక ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో జూలై 21న విడుదల కానుంది. తెలుగులో ఎస్ఆర్డిఎస్ సంస్థ ఈ సినిమా విడుదల చేయనుంది. ఈ సినిమాలో వనితా విజయ్ కుమార్, అర్జున్ చిదంబరం, సురేష్ చక్రవర్తి తదితరులు ఇతర కీలక పాత్రలలో నటించారు.

Show comments