Aditi Shankar:ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో స్టార్స్ గా కొనసాగుతునంవారందరూ నట వారసులుగా అడుగుపెట్టినవారే. హీరోలు, హీరోయిన్లు.. ఏ భాషలో చూసినా ఈ నెపోటిజం కనిపిస్తూనే ఉంటుంది. అయిపోతే కొంతమందికి మాత్రం తమ వారసులను ఇండస్ట్రీలోకి దించాలని కోరుకోరు. కానీ వారు పట్టుబడితే మాత్రం వద్దు అనలేరు. ప్రస్తుతం అలాంటి పరిస్థితిలోనే ఉన్నాడు దేశం గర్వించదగ్గ డైరెక్టర్ శంకర్. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో ఇండియన్ 2, ఆర్సీ 15 తెరకెక్కుతున్నాయి. ఇకపోతే ఇటీవలే శంకర్ కూతురు అదితి శంకర్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. కార్తీ సరసన విరుమాన్ లో నటించి మెప్పించింది. సినిమా పెద్దగా విజయాన్ని అందుకోలేకపోయిన అదితికి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో అదితి తన తండ్రి గురించి పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది. తాను హీరోయిన్ గా చేయడం శంకర్ కు ఇష్టం లేదని, కానీ హీరోయిన్ అవ్వడం తనకు ఇస్తామని చెప్పడంతో తన తండ్రి అయిష్టంగానే ఒప్పుకున్నట్లు తెలిపింది. అందులోనూ మొదటి సినిమానే కార్తీ సరసన నటించే అవకాశం రావడంతో ఓకే అన్నారని చెప్పుకొచ్చింది. తాజాగా అదితికి తండ్రి శంకర్ వార్నింగ్ ఇచ్చినట్లు కథనాలు వెలువడుతున్నాయి.
ఇక ఈ సినిమా చేస్తున్నప్పుడే శింబుతో కలిసి కరోనా కుమార్ అనే సినిమాలో అవకాశం అందుకున్నదట అదితి. అది విన్న శంకర్ కోపంతో రగిలిపోయినట్లు తెలుస్తోంది. ఏ హీరోతోనైనా నటించు కానీ, శింబు సరసన నటిస్తే మాత్రం శంకర్ ఒప్పుకోను అని చెప్పారట శంకర్. ఒకవేళ దానికి కారణం శింబు ప్రేమ వివాదాలే అయ్యి ఉంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఒక తండ్రిగా కూతురు బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి ముందే హెచ్చరించాడు శంకర్ అని మరికొందరు చెప్పుకొస్తున్నారు. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియదు కానీ తండ్రి మాటను ఈ కూతురు ఎన్ని రోజులు వింటుందో చూడాలి అంటున్నారు నెటిజన్లు.
