NTV Telugu Site icon

సీఎం రేవంత్‌రెడ్డికి టాలీవుడ్‌ డైరెక్టర్‌ బహిరంగ లేఖ

Sanjeev

Sanjeev

నూతన తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెల్సిందే. ఇక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే.. ఆయన పనులు మొదలుపెట్టారు. ఎవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో అన్ని తెలుసుకొని నెరవేరుస్తున్నారు. ఎప్పటినుంచో మాట ఇచ్చిన ప్రకారం మొట్టమొదటి సంతకం రజినీ ఫైల్ మీదనే పెట్టి.. అందరిని ఆశ్చర్యపరిచారు. ఇక నిత్యం ప్రజా దర్బార్ పేరిట వస్తున్న సమస్యలపై కూడా ఆయన దృష్టి సారించారు. నిన్నటికి నిన్న మాజీ సీఎం కేసీఆర్ ను పలకరించడానికి హాస్పిటల్ కూడా వెళ్లి వచ్చారు. ఇక తాజాగా ఒక తెలుగు డైరెక్టర్.. సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాయడం హాట్ టాపిక్ గా మారింది. యంగ్‌ హీరో అల్లు శిరీష్‌తో ABCD అనే సినిమా తెరకెక్కించి అందరి దృష్టిని ఆకార్చించాడు డైరెక్టర్ సంజీవ్ రెడ్డి. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక చాలా జిప్ తరువాత రాజ్‌ తరుణ్‌ హీరోగా ఆహా నా పెళ్లంట అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది మంచి విజయాన్నే అందుకుంది.

ఇక ట్విట్టర్ వేదికగా సంజీవ్.. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ సమస్యలను పట్టించుకోమని చెప్పడమే కాకుండా సినిమాటోగ్రపీ మినిస్టర్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి సినీ సమస్యలను పట్టించుకోవాలని చెప్పుకొచ్చాడు. కళాకారులూ, సాంకేతిక నిపుణులు ఎక్కువగా ఉండే కృష్ణానగర్ మరియు మణికొండ ప్రాంతాల దగ్గర్లో నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకొనుటకు ఆడిటోరియాలు కట్టించగలరు అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం సంజీవ్ రెడ్డి పేరు నెట్టింట మారుమ్రోగిపోతుంది. మరి ఈ సమస్యలపై సీఎం ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

Show comments