NTV Telugu Site icon

Sandeep Reddy Vanga: నీ నెక్స్ట్ సినిమాలు తలుచుకుంటేనే భయమేస్తుంది మావా…

Sandeep Reddy Vanga

Sandeep Reddy Vanga

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాలతో జస్ట్ శాంపిల్ చూపించిన సందీప్ రెడ్డి వంగ… అనిమల్ సినిమాతో బాక్సాఫీస్ కి 70MM బొమ్మ చూపిస్తున్నాడు. రణబీర్ కపూర్ లోని యాక్టింగ్ పొటెన్షియల్ ని కంప్లీట్ గా వాడుకుంటూ ఒక ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ కి కమర్షియల్ టచ్ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగ. డిసెంబర్ 1న రిలీజైన అనిమల్ మూవీ పాన్ ఇండియా హిట్ అయ్యింది, అనిమల్ హిట్ అవుతుంది అనుకున్న వాళ్లు కూడా ఈ రేంజ్ హిట్ అవుతుందని కలలో కూడా ఊహించి ఉండరు. కెనడా నుంచి ఆస్ట్రేలియా వరకు చాలా సెంటర్స్ లో కొత్త బాక్సాఫీస్ రికార్డ్స్ ని క్రియేట్ చేసింది అనిమల్ సినిమా. అయితే అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ లు కాదు… సందీవ్ లైనప్ చూస్తే అనిమల్ సినిమానే శాంపిల్ అన్నట్లు ఉంది. సందీప్ రెడ్డి వంగకి ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ చూస్తేనే బుర్రపాడు అయ్యేలా ఉన్నాయి.

రెబల్ స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ సినిమా ఇప్పటికే అనౌన్స్ అయ్యి ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సందీప్ రెడ్డి వంగ ఒక ప్రాజెక్ట్ కమిట్ అయి ఉన్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక సినిమా చేసే ఆలోచనలో ఎప్పటినుంచో ఉన్నాడు సందీప్ రెడ్డి వంగ. ఇవి చాలవన్నట్లు అనిమల్ సినిమాకి అనిమల్ పార్క్ కూడా రెడీ అవుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం అనిమల్ పార్క్ మూవీనే సెట్స్ పైకి వెళ్లేలా ఉంది. అనిమల్ పార్క్ సినిమాపై ఉన్న హైప్ ప్రకారం చూస్తే ఇది ఈజీగా 1000 నుంచి 1500 కోట్ల ప్రాజెక్ట్ అయ్యేలా ఉంది. ఇక ప్రభాస్ తో చేయబోయే స్పిరిట్ రేంజ్ ఏంటో ఊహించడం కూడా కష్టమే. సో ఇప్పటికైతే సందీప్ రెడ్డి వంగ ఫ్యూచర్ లో బాక్సాఫీస్ షాటర్ చేయడం గ్యారెంటీ.

Show comments