దర్శక ధీరుడు రాజమౌళి అస్వస్థతకు గురయ్యారా..? అంటే అవుననే అంటున్నారు ఆయన సన్నిహితులు.. గత కొన్నిరోజులుగా రాజమౌళి వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారంట.. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే చికిత్స తీసుకొంటున్నారని సమాచారం. ఇకపోతే రాజమౌళి సినిమాల విషయంలో ఎంతటి డెడికేషన్ చూపిస్తారో అందరికి తెలిసిందే.. ‘ట్రిపుల్ ఆర్’ చిత్ర ప్రమోషన్ కోసం కూడా ఆయన ఆ డెడికేషనే చూపించారు. ఆరోగ్యం సహకరించకపోయినా అభిమానుల నుంచి మాట రాకుండా జనని సాంగ్ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారంట.. విలేకరులు అడిగిన ప్రతి ప్రశ్నకు ఆయన ఓపిగ్గా సమాధానం చెప్పారు. ఆ ప్రెస్ మీట్ లో కూడా జక్కన కొద్దిగా నీరసంగా కనిపించారని అభిమానులు చెబుతున్నారు. దీంతో ఆయన ఈ సినిమా కోసం ఎంత తపన పడుతున్నారో అర్ధమవుతుంది అంటున్నారు టాలీవుడ్ వర్గాల వారు.
అనారోగ్యంతో ఉన్నప్పటికీ అభిమానుల ఆసక్తిని గమనించి, ప్రమోషన్ లో పాల్గొన్న జక్కన్న డెడికేషన్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇకపోతే ‘జననీ’ సాంగ్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల తో పాటు మరో అయిదు విదేశీ భాషల్లో కూడా విడుదల అవుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7న బరిలోకి దిగుతోంది. త్వరలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక అట్టహాసంగా జరగనున్నట్లు మేకర్స్ తెలుపుతున్నారు.
