RRR సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచే సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇక అప్పట్లోనే టైటిల్ విషయమై సోషల్ మీడియాలో హాట్ చర్చ నడిచింది. వర్కింగ్ టైటిల్ కే అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో అభిమానులే సినిమాకు టైటిల్ ను సూచించాలని, అందులో తమకు నచ్చిన టైటిల్ ను ఎంచుకుని ఖరారు చేస్తామని రాజమౌళి టీం ప్రకటించారు. దీంతో RRRపైనే టైటిల్స్ వెల్లువెత్తాయి. అయితే రాజమౌళి మాత్రం సినిమా టైటిల్ “రౌద్రం రణం రుధిరం” అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. అయినప్పటికీ సినీ లోకం మొత్తం సినిమాను RRR అనే పిలవడం కంటిన్యూ చేశారు.
Read Also : RRR Press Meet : రాజమౌళిని విలన్ చేసేసిన ఎన్టీఆర్
తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో రాజమౌళి టైటిల్ విషయమై మాట్లాడుతూ RRR వర్కింగ్ టైటిల్ అని చెప్పినా అభిమానులు వినిపించుకోలేదు. అదే బాగుంది… మేము ఫిక్స్ అయిపోయాం అన్నారు. ఇక మేము కొన్ని టైటిల్స్ అనుకున్నప్పటికీ వాళ్ళకోసమే RRRను ఖరారు చేశామని చెప్పుకొచ్చారు. అయితే సినిమాకు అనుకున్న అసలు టైటిల్ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది ఇప్పుడు !
