NTV Telugu Site icon

Puri Jagannath: ఛార్మితో ఎఫైర్.. ఎట్టకేలకు నిజం చెప్పిన పూరి

Puri

Puri

Puri Jagannath: డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పూరి- విజయ్ దేవరకొండ దర్శకత్వంలో లైగర్ సినిమా తెరకెక్కిన విషయం విదితమే. ఆగస్టు 25 న పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లతో బిజీగా మారిపోయింది. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో పూరి ఎప్పటినుంచో అభిమానులను వేధిస్తున్న ప్రశ్నకు సమాధానం చెప్పుకొచ్చాడు. నటి ఛార్మికు, పూరికి మధ్య ఎఫైర్ ఉందని, ఛార్మి కోసం పూరి భార్యను కూడా వదిలిపెట్టేసాడని వార్తలు గుప్పుమన్నాయి. ఇన్నేళ్ళుగా ఈ కపుల్ దీని గురించి మాట్లాడింది లేదు. ఛార్మి సైతం ఏనాడూ ఈ విషయమై నోరు విప్పింది లేదు. ఎట్టకేలకు తమ రిలేషన్ పై మొట్టమొదటిసారి పూరి నోరు విప్పాడు. తాము ఇద్దరం మంచి స్నేహితులమని కుండా బద్దలుకొట్టేశాడు.

“ఛార్మి నాకు 13 ఏళ్ల వయస్సు నుంచి తెలుసు. అప్పటి నుంచి ఆమెతో పనిచేస్తున్నాను. ఇక ఎప్పటినుంచో మా ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందని మాట్లాడుకుంటున్నారు. ఛార్మి వయస్సులో ఉంది కాబట్టి ఇలాంటి అనుమానాలు వచ్చాయి. ఒకవేళ ఛార్మి కి 50 ఏళ్లు ఉంటే మీరు ఈ విధంగా మాట్లాడేవారా..? పోనీ ఛార్మికి పెళ్లి అయ్యి ఉంటే కూడా ఇదే విధంగా ఎఫైర్ అనేవారా..? లేదు కదా. సరే ఒక వేళ మా ఇద్దరి మధ్య ఎఫైర్ ఉంటే .. ఇప్పటివరకు మేము కలిసి ఉండేవాళ్ళం కాదు. ఎందుకంటే ఆకర్షణ ఎన్నో రోజులు ఉండదు.. కానీ స్నేహం మాత్రం ఎప్పటికి నిలిచే ఉంటుంది. స్నేహమే శాశ్వతం. మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం పూరి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక పూరి క్లారిటీ తో ఈ రూమార్స్ కు చెక్ పడతాయేమో చూడాలి.

Show comments