Site icon NTV Telugu

Meher Ramesh : చరణ్ సంస్కారం ఎలాంటిదంటే ? డబ్బుతో కొనేది కాదు !

Ram Charan

Ram Charan Birthday Celebrations ఆదివారం రోజు శిల్పకళా వేదికలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి వరుణ్ తేజ్, బాబీతో పాటు యంగ్ డైరెక్టర్ మెహర్ రమేష్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మెహర్ రమేష్ మాట్లాడుతూ “రామ్ చరణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మీకెవరికీ తెలియని ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. మెగాస్టార్ రీఎంట్రీని గ్రాండ్ గా ప్లాన్ చేసిన చెర్రీ ఆ బాధ్యతను వీవీ వినాయక్ కు అప్పగించారు. ఆయన కూడా అనుకున్నట్టుగానే అద్భుతమైన హిట్ ను ఇచ్చారు. దీంతో ఒకరోజు చెర్రీ నాకు ఫోన్ చేసి ఇంటికి వినాయక్ వస్తున్నారు.. రమ్మని అడిగారు. చెర్రీకి తెలుగు రాదు… కానీ తెలుగులో వినాయక్ కు థ్యాంక్స్ నోట్ రాసి, శాలువా కప్పి సత్కరించి, ఇలాంటి బ్లాక్ బస్టర్ హిట్ ను ఇచ్చినందుకు ఆయన కాళ్లకు నమస్కరించారు. ఇలాంటి సంస్కారం చరణ్ ది… అది ఒకరు నేర్పిస్తేనో, లేక డబ్బులు ఇస్తేనో వచ్చేది కాదు” అని అన్నారు.

Read Also : KGF 2 : ‘బీస్ట్’తో పోలిక… విజయ్ పై యష్ ఆసక్తికర వ్యాఖ్యలు

Exit mobile version