Site icon NTV Telugu

LEO: ఈ ఫోటో సోషల్ మీడియాని రూల్ చేస్తుంది…

Leo

Leo

గత 24 గంటలుగా సోషల్ మీడియాని ఒక ఫోటో రూల్ చేస్తుంది. #Leo ట్యాగ్ తో ట్రెండ్ క్రియేట్ చేస్తున్న దళపతి విజయ్ ఫాన్స్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ పోస్ట్ చేసిన ఫోటోని వైరల్ చేస్తున్నారు. లోకేష్ కనగరాజ్ పుట్టిన రోజు ఇటివలే జరిగింది, ఈ సంధర్భంగా ప్రతి ఒక్కరూ లోకేష్ ని విష్ చేశారు. లియో చిత్ర యూనిట్ కూడా లోకేష్ కనగరాజ్ పుట్టిన రోజుని షూటింగ్ స్పాట్ లో సెలబ్రేట్ చేశారు. విజయ్, సంజయ్ దత్ ఇతర కాస్ట్ అండ్ క్రూ మధ్య బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న లోకేష్ కనగరాజ్, ట్విట్టర్ లో విజయ్ తో దిగిన ఫోటోని పోస్ట్ చేసి కృతజ్ఞతలు తెలిపాడు. విజయ్ కి సంబంధించిన చిన్న వార్త బయటకి వస్తేనే ఫాన్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తారు అలాంటిది ఏకంగా కొత్త లుక్ లో ఫోటో బయటకి వస్తే సైలెంట్ గా ఉంటారా, నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు.

ఈ డైరెక్టర్-హీరో కాంబినేషన్ లో ‘మాస్టర్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ‘బుల్స్ ఐ’ని హిట్ చెయ్యడంలో మిస్టేక్ జరిగింది. ఈసారి మాత్రం ఆ తప్పు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న లోకేష్ కనగరాజ్, పాన్ ఇండియా సంభవం సృష్టించడానికి రెడీ అయ్యాడు. 90 రోజుల్లో షూటింగ్ పార్ట్ కంప్లీట్ చెయ్యడానికి ప్లాన్ చేసుకున్న లియో చిత్ర యూనిట్, శరవేగంగా సినిమా షూటింగ్ చేస్తున్నారు. అక్టోబర్ లో ఎట్టి పరిస్థితిలో లియో సినిమా రిలీజ్ చేసి ఈ దసరా నుంచి దీపావళి వరకూ బాక్సాఫీస్ ని సొంతం చేసుకోవాలనేది లియో డైరెక్టర్-హీరో ప్లాన్ మరి ఇది ఎంత వరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.

Exit mobile version