NTV Telugu Site icon

Lokesh Kanagaraj: కొత్త కారు కొన్న ‘విక్రమ్’ డైరెక్టర్.. ధర ఎంతంటే ..?

Lokesh

Lokesh

Lokesh Kanagaraj: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం లియో సినిమాతో బిజీగా ఉన్నాడు. ఖైదీ సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీనే కాకుండా టాలీవుడ్ ను షేక్ చేసిన లోకేష్.. మాస్టర్ తో విజయ్ ను అల్ట్రా స్టైలిష్ లుక్ లో చూపించి మెప్పించాడు. ఇక విక్రమ్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ ను అందుకున్నాడు. కమల్ హాసన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ను అందించిన డైరెక్టర్ గా ఇండస్ట్రీలో నిలబడిపోయాడు. ఇక ప్రస్తుతం విజయ్ తో లియో సినిమా చేస్తున్న లోకేష్.. తాజాగా ఒక కాస్ట్లీ కారుకు యజమానిగా మారాడు. ప్రస్తుతం మార్కెట్ లో లగ్జరీ కారుగా చెలామణి అవుతున్న బీఎండబ్ల్యూ 7 సిరీస్ ను లోకేష్ సొంతం చేసుకున్నాడు. ఇక దీని ధర తెలిసి అభిమానులు అవాక్కవుతున్నారు. ఈ కారు ధర అక్షరాలా రూ.కోటి 70 లక్షలు ఉంటుందని సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

Josh Ravi: అవకాశాలు రాకపోతే ఆ పనైనా చేస్తాను కానీ, జబర్దస్త్ కు మాత్రం వెళ్లను
ఇక కోలీవుడ్ టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్న లోకేష్ కు ఇదేం పెద్ద అమౌంట్ కాదని, విక్రమ్ తరువాత ఆయన తన రెమ్యూనిరేషన్ కూడా పెంచాడని వార్తలు వినిపిస్తున్నాయి. బ్లాక్ కలర్ బీఎండబ్ల్యూ చూడడానికి ఎంతో అందంగా ఉంది. ఇక ఈ ఫోటో చూసిన అభిమానులు కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక లోకేష్ లైనప్ గురించి మాట్లాడుకుంటే.. లియో సినిమాను పూర్తిచేసాక లోకేష్.. రజినీకాంత్ తో ఒక సినిమా చేయనున్నాడు. దీని తరువాత తన హిట్ సినిమా ఖైదీకి సీక్వెల్ చేయనున్నాడు.. ఇక ఇవే కాకుండా ప్రభాస్ తో ఒక సినిమా చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Show comments