Site icon NTV Telugu

Director Krish: అరేబియా కడలి.. తండేల్ స్టోరీలా ఉంది.. పవన్ డైరెక్టర్ కాపీ కొట్టాడా.. ?

Krish

Krish

Director Krish: క్రిష్ జాగర్లమూడి.. ఈ పేరు ఈ మధ్య వార్తల్లో బాగా నానిన విషయం తెల్సిందే. ర్యాడిసన్ బ్లూ హోటల్ లో జరిగిన డ్రగ్స్ రైడ్ లో క్రిష్ పేరు కూడా రావడంతో.. ఆయన ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. ఇప్పుడంటే సినిమాల విషయంలో కొద్దిగా వెనక్కి తగ్గాడు కానీ, ఒకప్పుడు క్రిష్ తీసిన సినిమాలు అన్ని అవార్డు విన్నింగ్ సినిమాలే. ఇక అప్పుడెప్పుడో హరిహర వీరమల్లు సినిమాను ప్రకటించారు. పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. సగం సినిమా ఫినిష్ అయ్యాకా.. ఈ సినిమాకు చిక్కులు వచ్చి పడ్డాయి. పవన్ కు ప్రచారాలు ఎక్కువ కావడంతో సమయం కేటాయించలేకపోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బడ్జెట్ కూడా ఎక్కువ అవుతుండడంతో నిర్మాత ఆపేసినట్లు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ, అందులో నిజం లేదని నిర్మాత రత్నం క్లారిటీ ఇచ్చాడు. ఎప్పుడు పవన్ డేట్స్ దొరికితే అప్పుడు ఈ సినిమాను ఫినిష్ చేస్తామని చెప్పుకొచ్చాడు. దీంతో పవన్ ఫ్యాన్స్.. ఈ సినిమా ఉంటుందా.. ? ఉండదా.. ? అనే సందిగ్ధంలోనే సమయాన్ని గడిపేస్తున్నారు.

ఇక ఇదంతా పక్కన పెడితే.. ప్రస్తుతం క్రిష్.. తన కొత్త ప్రాజెక్ట్ ను ప్రకటించాడు. నేడు అమెజాన్.. తన ఒరిజినల్ సిరీస్ లను ప్రకటిస్తున్న విషయం తెల్సిందే. అందులో క్రిష్ ప్రాజెక్ట్ కూడా ఒకటి. అదే అరేబియా కడలి. సత్యదేవ్, ఆనంది జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై వై రాజీవ్ రెడ్డి, జె సాయిబాబు నిర్మిస్తున్నారు. ఇందులో నాలుగు కథలు ఉండగా.. అందులో ఒక కథను క్రిష్ అందించాడు. ఇక ఈ సిరీస్ మొత్తానికి సూర్య కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రత్యర్థి గ్రామాల నుండి అనుకోకుండా అంతర్జాతీయ జలాల్లోకి చొరబడి విదేశీ జైలులో బంధించబడిన మత్స్యకారుల బృందం చుట్టూ తిరిగే సస్పెన్స్ డ్రామా సిరీస్ గా తెరకెక్కుతున్నట్లు తెలిపారు. అయితే ఇలాంటి కథతో తండేల్ అనే సినిమా తెరకెక్కుతుంది. మరి ఈ రెండు ఒకటేనా.. ? కాదా.. ? అనేది తెలియాల్సి ఉంది.

Exit mobile version