NTV Telugu Site icon

Waltair Veerayya: వాల్తేరు వీరయ్య టైటిల్.. బాబీ చెప్పిన ఇంట్రెస్టింగ్ స్టోరీ

Waltair Veerayya Title

Waltair Veerayya Title

Director Bobby Reveals Interesting Story Behind Waltair Veerayya Title: సినిమాలకు ‘టైటిల్’ అనేది ఎంతో ముఖ్యమైందో అందరికీ తెలుసు. ఒక సినిమా మొత్తం దాని మీదే ఆధారపడి ఉంటుంది. సినిమాపై క్యూరియాసిటీ పెరగాలన్నా, ప్రేక్షకులు ఆ సినిమా పట్ల ఆకర్షితులు అవ్వాలన్నా.. ఈ టైటిలే కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే.. ఫిల్మ్‌మేకర్స్ ఎంతో కసరత్తు చేసి తమ సినిమాకు సరిగ్గా సూటయ్యేలా, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేలా ఏరికోరి మరీ ఆసక్తికరమైన టైటిల్స్‌నే ఎంపిక చేస్తారు. కొన్ని సినిమాలకైతే.. ఈ టైటిల్సే పునాదులు వేస్తాయి. అలాంటి సినిమాల్లో వాల్తేరు వీరయ్య ఒకటని దర్శకుడు బాబీ తన ప్రమోషన్ కార్యక్రమాల్లో చెప్పుకొచ్చాడు. తాను స్టోరీ రాసుకొని ఈ టైటిల్ ఫిక్స్ చేయలేదని, టైటిల్ ఆధారంగా స్టోరీ రాసుకున్నానంటూ.. ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పుకొచ్చాడు.

Waltair Veerayya Trailer: వాల్తేరు వీరయ్య ట్రైలర్.. నిజంగా పూనకాలే!

డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ.. ‘‘యాగంటిలో వెంకీ మామ చిత్రీకరణ జరుగుతున్న సమయంలో.. నటుడు నాజర్ నాకు ఒక పుస్తకం ఇచ్చారు. అది చదువుతున్నప్పుడు, అందులోని ‘వీరయ్య’ అనే పేరు నన్ను బాగా ఆకట్టుకుంది. ఈ ‘వీరయ్య’ అనే టైటిల్‌తో సినిమా చేయాలని నేను అప్పుడే నిర్ణయించుకున్నా. ఈ విషయం మా టీం సభ్యులకు కూడా చెప్పాను. అలాగే.. మెగాస్టార్ చిరంజీవి ఇంకా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టకముందు బాపట్లలో ఉన్నప్పుడు, చిరు నాన్న వద్ద పని చేసే ఓ హెడ్ కానిస్టేబుల్ ఐదు వందలు ఇచ్చి, చిరుతో ఫోటోషూట్ చేయించారు. ఆ ఫోటోల వల్లే తాను మద్రాస్ వచ్చానని చిరంజీవి చెప్పారు. చిరుకి సహాయం చేసిన ఆ కానిస్టేబుల్ పేరు కూడా వీరయ్యనే. సో.. ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అలా వాల్తేరు వీరయ్య స్టోరీ పుట్టుకొచ్చింది. ఇది చిరంజీవికి కూడా బాగా నచ్చింది’’ అని వివరించాడు. ఇదన్నమాట ఈ టైటిల్ వెనకున్న అసలు సంగతి!

Constable Love Affair : ఫ్రెండ్ షిప్.. లవ్.. రూమ్.. ప్రెగ్నెంట్ కాగానే ప్లాన్ రివర్స్

కాగా.. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఓ కీలక పాత్రలో నటించాడు. శృతిహాసన్ కథానాయికగా నటించగా, కేథరిన్ తెరిసా కూడా ఇందులో మెరిసింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్స్‌కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన రావడంతో.. ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. మరి, జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ సృష్టిస్తుందో చూడాలి.