డింపుల్ హయాతి..ఈ హాట్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తన అందంతో తెలుగులో మంచి అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది ఈ భామ. అయితే ఈ భామ రీసెంట్ గాహైదరాబాద్ ట్రాఫిక్ లో ఇరుక్కుంది. ఆ ట్రాఫిక్ చూసి అసహనం వ్యక్తం చేసింది.ట్రాఫిక్ డీసీపీ ఎక్కడంటూ ప్రశ్నించింది. ఏకంగా మంత్రి కేటీఆర్ మరియు తెలంగాణా సీఎంఓ అకౌంట్స్ ని ట్యాగ్ చేస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ చాలా దారుణంగా ఉందంటూ ట్వీట్ చేసింది.డింపుల్ హయాతీ డేరింగ్ చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. డింపుల్ ట్రాఫిక్ జామ్ పై ఇంత డేరింగ్ గా మాట్లాడటానికి ఒక కారణం కూడా ఉంది.. హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేతో డింపుల్ కి మధ్య రీసెంట్ గా ఒక వివాదం నడిచిన విషయం తెలిసిందే.ఆయన్ని టార్గెట్ చేస్తూ డింపుల్ ఈ తరహా ట్వీట్ చేశారనీ సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి..డీసీపీ రాహుల్ హెగ్డే కారణంగా డింపుల్ హయాతీ, ఆమె ప్రియుడు చట్టపరమైన చర్యలు ఎదుర్కొంటుంది.పార్కింగ్ ఏరియాలో ఉన్న తన కారును తన్నడంతో పాటు డ్రైవర్ ని కూడా దూషించిందంటూ రాహుల్ హెగ్డే డింపుల్ హయాతీ మీద కేస్ బుక్ చేశాడు. ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది.
రాహుల్ హెగ్డే ఉద్దేశపూర్వకంగా నన్ను ఇరికించారు అని నిజాలు త్వరలో తెలుస్తాయని ఆ వివాదంపై డింపుల్ హయాతి వివరణ కూడా ఇచ్చారు.రీసెంట్ గా ఈ భామ ట్రాఫిక్ లో ఇరుక్కుంది.. ఆ ట్రాఫిక్ చూసి అసహనం వ్యక్తం చేస్తూ ఇంటికి వెళ్లాలంటే గంటల సమయం పడుతుంది. ఎమర్జెన్సీ అయితే మా పరిస్థితి ఏంటీ అస్సలు ట్రాఫిక్ డీసీపీ ఎక్కడ వున్నారు.అసలు హైదరాబాద్ లో కాలు బయట పెట్టగలమా..మాకు పెట్రోల్ ఏమి ఉచితంగా రావడం లేదు, అని ట్వీట్ చేసింది.ఆ ట్వీట్ కి మంత్రి కేటీఆర్ మరియు తెలంగాణా సీఎంఓ అధికారిక ట్విట్టర్ అకౌంట్స్ను కూడా జోడించింది.డింపుల్ హయాతి చేసిన ఆ ట్వీట్ బాగా వైరల్ అవుతుంది. కాగా డింపుల్ హయాతి కెరీర్ కూడా ప్రస్తుతం కొంత ఒడిదుడుకులతో ఉంది . ఆమె లేటెస్ట్ గా నటించిన రామబాణం సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దీనితో ఈ భామకు అవకాశలు రావడం తగ్గాయి.
https://twitter.com/DimpleHayathi/status/1681686305846198273?s=20
