Site icon NTV Telugu

ఆఫీస్ స్టాఫ్‌కు దిల్ రాజు వ్యాక్సినేషన్!

కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందరికీ సూచిస్తోంది. ప్రైవేట్ సంస్థలు సైతం తమ సిబ్బందికి వాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నాయి. మరోవైపు సినీప్రముఖులు కూడా తమ ఆఫీస్ స్టాఫ్‌కు వ్యాక్సినేషన్ వేయిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ, మహేష్ బాబు తమ స్టాఫ్ మెంబర్స్‌కు ప్రత్యేకంగా కరోనా వాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు. అయితే తాజాగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా తమ సిబ్బందికి మరియు తన చిత్రాలకు పని చేస్తున్న వారికి అందరికీ వ్యాక్సిన్ వేయించారు. తన కార్యాలయంలోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దాదాపు 200 మందికి తన కార్యాలయంలోనే ప్రత్యేకంగా వ్యాక్సిన్ వేయించారు. దీనికి సంబందించిన ఫోటోలను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విట్టర్ లో షేర్ చేసింది.

Exit mobile version