Site icon NTV Telugu

Dil Raju: ‘తెలుసా… మనసా’ అంటున్న పార్వతీశం

Telusa

Telusa

Parvatheesam: ‘కేరింత’ ఫేమ్ పార్వతీశం హీరోగా జశ్విక హీరోయిన్‌గా వైభ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌ర్షా ముందాడ‌, మాధ‌వి నిర్మిస్తోన్న న్యూ ఏజ్ ప్లాటోనిక్ ల‌వ్ స్టోరి ‘తెలుసా..మనసా..’. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్ర‌మిది. పల్లెటూరిలో బెలూన్స్ అమ్ముకునే మల్లిబాబు, అదే ఊర్లో ప‌నిచేసే హెల్త్ అసిస్టెంట్ సుజాతను ప్రేమిస్తాడు. ఇద్ద‌రికీ ఒక‌రిపై ఒక‌రికి ప్రేమ ఉంటుంది కానీ ఎప్పుడూ దాన్ని వ్యక్తం చేసుకోరు. అయితే ఉన్న‌ట్లుండి మ‌ల్లిబాబు క‌ల‌లు కూలిపోతాయి. సుజాత‌కు దూరం కావాల్సి వ‌స్తుంది. మ‌రి వారిద్ద‌రూ క‌లుసుకున్నారా? లేదా? అనేదే ఈ చిత్ర కథ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. బుధవారం ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు విడుద‌ల చేసి చిత్ర యూనిట్‌కి అభినంద‌న‌లు తెలిపారు. ఫ‌స్ట్ లుక్‌ పోస్టర్ లో హీరోహీరోయిన్లు పార్వతీశం, జశ్వికతో పాటు సీనియర్ నటీమణి రోహిణి హట్టంగడి కూడా ఉన్నారు. నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీ సుంద‌ర్ స్వరాలు సమకూర్చుతున్న ఈ సినిమాకు ప్ర‌సాద్ ఈద‌ర సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Exit mobile version