Site icon NTV Telugu

Dil Raju: దేవర వాయిదా పడితేనే.. అది చేయగలం

Devara

Devara

Dil Raju: సంక్రాంతి సినిమాల సందడి అయిపొయింది. నాలుగు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయ్యి.. తమ సత్తా చాటాయి. ఇక ఇప్పుడు సమ్మర్ వంతు వచ్చేసింది. ఈ సమ్మర్ లో కూడా స్టార్ హీరోలు.. తమ సినిమాలతో క్యూ కట్టారు. ఎవరెవరు వస్తున్నారు.. ? ఎవరెవరు వెనక్కి తగ్గుతున్నారు అని తెలియడానికి ఇంకా చాలా టైమ్ ఉంది. ఇక ఈ నేపథ్యంలో థియేటర్ల సమస్యలపై ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు మాట్లాడారు. ఇక ఈ మీట్ లో దిల్ రాజు మాట్లాడుతూ.. సంక్రాంతి సినిమాల పోటీ నుంచి తప్పుకుంటే, తప్పుకున్న సినిమాకి సోలో రిలీజ్ ఇస్తామని చెప్పినట్లు తెలిపారు. ఇక ఆరోజున మరో రెండు సినిమాలు రావడంతో.. అవి వాయిదా పడినట్లు దిల్ రాజు స్పష్టం చేశారు. ఇక దీంతో పాటు దేవర సినిమా గురించి మాట్లాడడం హాట్ టాపిక్ గా మారింది.

ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం దేవర. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం ఏప్రిల్ 5 న రిలీజ్ కానుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉంటే కనుక తాము పోటీలో దిగుతామని దిల్ రాజు చెప్పారు. ఈ ఏడాది సమ్మర్‌లో దేవర సినిమా ఉంది. ఒకవేళ దేవర వాయిదా పడితే మేము వస్తామని అన్‌ అఫీషియల్‌గా చెప్పాం. దేవర పోస్ట్‌ పోన్ అయితే మా సినిమా ఫ్యామిలీ స్టార్‌ వస్తుంది” అని చెప్పుకొచ్చారు. ఇంకోపక్క దేవర వాయిదా పడే ఛాన్స్ లు లేవని మేకర్స్ తెలుపుతున్నారు. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Exit mobile version