Amani: దిల్ రాజు చేతుల మీదుగా ‘నారి’ సినిమా ట్రైలర్ రిలీజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఆమని గురించి పరిచయం అక్కర్లేదు. దాదాపు చిరంజీవి బాలకృష్ణ వంటి స్టార్స్ అందరితో జతకట్టి తనకంటు మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రజంట్ బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటిస్తుంది. అలాగే ప్రాధాన్యత పాత్రలు ఎంచుకుంటూ మంచి మంచి సినిమాలు చేస్తోంది. ఇక ఇప్పుడు తాజాగా ‘నారి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఆమని. వికాస్ వశిష్ట, మౌనిక రెడ్డి, ప్రగతి, సునయన, కేదార్ శంకర్, ప్రమోదిని, తదితరులు కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ..మహిళల్ని గౌరవించాలి, ఆడపిల్లలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు సహకరించాలి అనే కాన్సెప్ట్ తో రాబోతుంది. సూర్య వంటి పల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రొడ్యూసర్ శ్రీమతి శశి వంటి పల్లి నిర్మించారు. ఇక ఈ సినిమా మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 7న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. దీంతో ఈరోజు ఈ సినిమా ట్రైలర్‌ను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేతుల మీదుగా రిలీజ్ చేశారు.
Also Read: Odela 2: వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఓదెల2 టీజర్
Also Read
- Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
- BhagyashriBorse : ఫ్లాపుల్లో భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఆఫర్స్..సక్సెస్ తర్వాత నో ఛాన్స్
- Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్‌కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
- The Vvaan: 400 ఏళ్ల ఆలయంలో సిద్ధార్థ్, తమన్నా ప్రత్యేక పూజలు.. గుడి మిస్టరీతోనే వస్తున్న కొత్త సినిమా
ఇందులో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ.. ‘మహిళల గురించి ఒక మంచి కథతో ‘నారి’ సినిమాను రూపొందించారు. ట్రైలర్ చాలా బాగుంది. కొత్త ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఇలాంటి మంచి ప్రయత్నం చేయడం సంతోషకరం. ఆమని గారు ‘మావిచిగురు’, ‘శుభలగ్నం’ లాంటి మూవీస్‌తో తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయారు. అలాగే మా సంస్థలో ఎంసీఏ, శ్రీనివాస కళ్యాణం మూవీస్ లో నటించారు. ‘నారి’ సినిమాను ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లాలని ఈ టీమ్‌కు సజెస్ట్ చేస్తున్నా. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటూ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’ అన్నాడు.
ఇక ఆమని మాట్లాడుతూ.. ‘ఈ రోజు మా ‘నారి’ మూవీ ట్రైలర్ దిల్ రాజు గారి చేతుల మీదుగా రిలీజ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. వాళ్ల బ్యానర్ లో నేను శ్రీనివాస కల్యాణం, ఎంసీఏ వంటి మూవీస్ చేశాను. అప్పటి నుంచి బిజీగా ఉంటున్నాను. వారి బ్యానర్ లో మరిన్ని మూవీస్ చేయాలనుకుంటున్నాను. ‘నారి’ సినిమా మహిళల గొప్పతనం చెప్పేలా మా దర్శకుడు సూర్య వంటిపల్లి రూపొందించారు. ఈ మూవీలో ఇంత మంచి రోల్ చేసే అవకాశం ఇచ్చిన సూర్య గారికి థాంక్స్. ప్రతి మహిళ చూడవలసిన చిత్రమిది. మహిళ జీవితంలో పుట్టినప్పటినుంచి అన్నీ కష్టాలే. అది అర్థం చేసుకున్న వాళ్ళు కొద్దిమందే ఉంటారు. ఇక ఈ రోజు సమాజంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తుంది ఈ మూవీ. నేను ఈ క్యారెక్టర్ లో ఎంతో ఇన్వాల్వ్ అయి నటించాను. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 7న రిలీజ్ అవుతున్న మా సినిమాను మీరంతా థియేటర్స్ లో చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం’ అని తెలిపింది.
తాజావార్తలు
-
Raptee.HV T30: రాప్టీ.హెచ్‌వి T30 ఎలక్ట్రిక్ బైక్.. 150KM రియల్ రేంజ్, కారు ఛార్జర్‌తో ఛార్జింగ్!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
-
Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
-
Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!